విశాఖ

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఫిబ్రవరి 20: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ భాస్కర్ తెలిపారు. మండలంలో పాములవాక జిల్లా పరిషత్ హైస్కూల్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వౌళిక వసతి సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఇంగ్లీష్ మీడియం తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఉచిత విద్యాబోధనతో పాటు మధ్యాహ్నా భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. బాలికలు ఉన్నత విద్యావంతులు అయినప్పుడే పలు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విద్యార్థులు తమ గ్రామాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఎటువంటి వత్తిళ్ళకు లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ జిల్లా నేత లాలం భాస్కరరావు, గ్రామ సర్పంచ్ కిల్లాడ సత్యవేణి, టీడీపీ నాయకులు వేచలపు జనార్ధన్, మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల ఫ్రభావిత ప్రాంతంలో ఎస్సై పర్యటన
సీలేరు, ఫిబ్రవరి 20: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కొండజర్త గ్రామంలో స్థానిక ఎస్సై విభూషణరావు మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా గిరిజనులతో సమావేశమయ్యారు. జి.కె.వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో ఉన్న కొండజర్త గ్రామంతో పాటు విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గిరిజనులు తమ సమస్యలను ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యుత్, చదువు వంటి సౌకర్యాలకు తమ గ్రామాలు దూరంగా ఉన్నాయన్నారు. తమ సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారన్నారు . రహదారి సౌకర్యం లేక కాలినడకన ఫ్రయాణించాల్సి వస్తుందన్నారు. సోలార్ దీపాలు తమ గ్రామాలకు ఏర్పాటు చేస్తే విద్యుత్ వెలుగులు పొందుతామన్నారు.