విశాఖ

ఘనంగా ముగిసిన గంగమ్మతల్లి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 20: మండలంలోని పాత, కొత్త సుజనకోట గ్రామాల్లో నిర్వహించిన శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. సోమవారం రాత్రి ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకూ భక్తులంతా ఘటాలను మోసి మొక్కులను తీర్చుకున్నారు. జాతరను పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు, బుడియాల నృత్యప్రదర్శనలు, విద్యుద్దీపాలంకరణ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంది. మంగళవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులందరూ మొక్కుబడులను తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సోమవారం రాత్రి అరకు వైకాపా సమన్వయకర్త చెట్టి ఫల్గుణ బహుమతులు, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్.రుక్మంగదర్, ఎంపీటీసీలు గాసీరాం, ఎం.చిన్నమ్మి, తహశీల్థార్ ఎస్.లింగయ్య, ఎస్.ఐ. అరుణ్‌కిరణ్, వైకాపా ఎస్టీ సెల్ కార్యదర్శి శెట్టి గంగాధరస్వామి, నిర్వాహకులు శంకరరావు, ఎస్.దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఎ.టి.ఎం. పనిచేయక ఖాతాదారుల ఇబ్బందులు
మాడుగుల, ఫిబ్రవరి 20: మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఎ.టి.ఎం. పనిచేయకపోవడంతో ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఉండడంతో పాటు వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా ఖాతాదారుల అవసరాలను గుర్తించిన బ్యాంక్ అధికారులు ఎ.టి.ఎం.ను ఏర్పాటు చేసినప్పటికీ అది తరచూ మర్మతులకు గురవుతూ ఖాతాదారులకు సహనాన్ని పరీక్షిస్తోంది. నగదు కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డాది గ్రామంలోని ఎ.టి.ఎం.కు వెళ్ళాల్సి వస్తోందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం వారు స్పందించడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులకు గురైన ఎ.టి.ఎం.ను వినియోగంలోకి తీసుకురావాలని ఖాతాదారులు, స్థానికులు కోరుతున్నారు.