విశాఖ

దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఫిబ్రవరి 20: దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత చెప్పారు. స్థానిక యువజన శిక్షణ కేంద్రంలో దివ్వాంగులకు ఉపకరణాలను మంగళవారం ఆమె పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్డ్ఫిషియల్ లింబ్స్ మ్యానుఫారకచరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దివ్వాంగులకు ఉపకరణాల పంపిణీ చేసినట్టు చెప్పారు. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలోని దివ్వాంగులకు 6.92 లక్షల రూపాయలతో విలువైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో 121 మంది దివ్వాంగులకు ఉపకరణాలను అందిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో త్వరలోనే మరిన్ని క్యాంపులను ఏర్పాటు చేసి ఉపకరణాలను పంపిణీ చేస్తామని ఆమె చెప్పారు. నియోజకవర్గానికి 30 టెలి మెడిసిన్ కేంద్రాలను మంజూరు చేయించినట్టు ఆమె తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు గీత చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, ఎ.సి.ఐ.ఎం.సి.ఒ. మేనేజర్ కె.వి.రాజేష్, డివిజనల్ అటవీ అధికారి ఐ.కె.వి.రాజు, ఏజెన్సీ విద్యాశాఖ అధికారి జ్యోతికుమారి, ఐ.టి.డి.ఎ. మేనేజర్ వి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.
మోదమ్మను దర్శించుకున్న ఎంపీ గీత
పాడేరు, ఫిబ్రవరి 20: అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత మంగళవారం స్థానిక శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బూరెడ్డి నాగేశ్వరరావు ఎం.పి.కి దుస్సాలువా కప్పి సత్కరించి అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు. మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయాలకు తన నిధులను కేటాయించడం సాధ్యంకాదని, ఇతరత్రా మార్గాల ద్వారా నిధుల కేటాయించేందుకు పరిశీలిస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. మేనేజర్ వి.సునీల్, డిప్యూటీ తాహశీల్ధార్ వి.త్రినాధరావు, బి.జె.పి. నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, పెనుమాక రవికుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.