విశాఖపట్నం

ప్రత్యేక హోదా ప్రస్తావన తేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ వైఖరిపై పార్టీ పరంగా పోరాడాల్సిందేనని, అయితే ప్రత్యేక హోదా అంశంతో కాకుండా ప్రత్యేక ప్యాకేజీపై ఉద్యమించాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పార్టీ వర్గాలకు సూచించారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, బడారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంతో తెగతెంపులు చేసుకునే ధోరణితో మనం ముందుకు వెళ్లట్లేదని, అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు వదులుకునేలా కూడా మన తీరు ఉండకూడదని సూచించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్యాకేజీ, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల మంజూరు వంటి అంశాలను ప్రస్తావించాలన్నారు. విపక్ష వైకాపా తీరును ఎండగట్టాలని సూచించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడితే అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరమీదకు తెచ్చిన జగన్ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం తన ఆఖరి బడ్జెట్‌లో కూడా ప్యాకేజీకి నిధులు కేటాయించకపోవడం వల్లే బీజేపీని నిలదీసే పరిస్థితులు ఎదురయ్యాని ప్రజలకు వివరించాలన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రం సాయం చేసి ఆదుకుంటుందని భావించామని అయితే అరకొర సాయంతో రాష్ట్రం ముందుకు సాగలేనందునే ఎదురు తిరగాల్సి వచ్చిందన్నారు. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధులపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలన్నారు. బీజేపీలో కూడా కొంతమంది నేతలు మాత్రమే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, దీనిపై సంయమనంతో మాట్లాడాలని సూచించారు.
అంతకు ముందు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, హక్కులను కేంద్రంతో సామరస్య పూర్వకంగా మాట్లాడి సాధించుకుందామని సూచించారు. ఇప్పటికీ కేంద్రంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఒత్తిడి తెచ్చయినా సరే నిధులు రాబట్టుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో దళితతేజం-తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని క్షేత్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.