విశాఖపట్నం

థర్డ్ ఫ్రంట్‌తో మోదీ రాజకీయాన్ని తిప్పికొట్టగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: తెలుగు ప్రజలను అవమానించేలా రాజకీయ కుట్రలకు పాల్పడితే థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీని చిత్తు చేయగలమని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో తెలుగు ప్రజలను అవమానించే ప్రయత్నం జరిగితే ఎన్‌టీ రామారావు, చంద్రబాబు హయాంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌లు ఏర్పాటు చేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.39వేల కోట్లతో సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) అందజేశామని, కేంద్రం కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటోందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకా పెట్టలేదంటున్న బీజేపీ, ఇప్పటి వరకూ అసెంబ్లీ, మండలిలో మీ ప్రతినిధులు ఎక్కడ కూర్చున్నారో తెలుసుకోవాలని సూచించారు. రహదార్ల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఇచ్చామంటూ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారని, ఆ నిధులతో నిర్మించిన ఒక్క రహదారిని చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాము సంయమనం పాటిస్తున్నామని, ఇది చేతగాని తనంగా బీజేపీ భావిస్తే తగిన సమయంలో గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఏపీకి న్యాయం జరుగుతుందంటే ఏలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని వెల్లడించారు. హోదా స్థానే ప్రకటించిన ప్యాకేజీ కూడా బడ్జెట్‌లో కన్పించకపోవడం వల్లే మా ఎంపీలు ఆందోళన చేశారన్నారు. తెలుగు ప్రజలను మోసం చేద్దామనుకున్న కాంగ్రెస్ మట్టికొట్టుకు పోయిందని, బీజేపీకి కూడా అదే దుస్థితి దాపురిస్తుందన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై తెలుగు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అయితే చంద్రబాబు మాత్రం సంయమనం పాటించాలని సూచించడం వల్లే తాము వౌనం వహించాల్సి వస్తోందన్నారు. ఇక ఎంపీ హరిబాబు కేంద్రానికి తాబేదారులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని, అంతే ప్రయోజనాలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని అన్నారు. సమయం మించిపోతోంది కాబట్టే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీస్తున్నామన్నారు. బీజేపీ నేతలు లక్షల కోట్ల నిధులు వచ్చాయంటూ అసత్య కథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉంటూ టీడీపీపై బురదజల్లేలా రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.