విశాఖపట్నం

స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న మత్స్యకారుల దీక్షను మిరమింపచేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం గందగోళంగా మారింది. మత్స్యకారుల డిమాండ్‌పై టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తాను మీకు స్పష్టమైన హామీ ఇస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేసిన మంగళవారం నాడిక్కడ చేసిన ప్రకటన మత్స్యకార ఉద్యమనాయకులను రెండు వర్గాలు విడదీసింది. సీఎం తరపున వచ్చిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నట్టు ఎస్టీలుగా గుర్తించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్న హామీ ఇవ్వకపోవడంపై ఒక వర్గం మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి మొదటి నుంచి మత్స్యకారులు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయం కేంద్రం పరిధిలోనిది, రాజ్యాంగ పరంగా కొన్ని నిబంధనల మేరకు రాష్ట్రప్రభుత్వం నడచుకోవాల్సి ఉంటుంది. కొంత ఆలస్యమైనా మీ డిమాండ్‌ను పరిష్కరిస్తాం. అప్పటి వరకూ దీక్షలు, ఆందోళనలు విరమించండంటూ చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే సీఎం చంద్రబాబు మత్స్యకార ప్రతినిధులతో కూలంకషంగా చర్చిస్తారని హామీ ఇచ్చారు. మత్స్యకార ప్రతినిధులను సీఎం వద్దకు తీసుకువెళ్లేందుకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొండబాబు, గణేష్‌కుమార్‌తో పాటు తాను కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాటగా మీకు హామీ ఇస్తున్నాంటూ ప్రకటించారు. అంతకు ముందు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులు అభిమానిస్తే ప్రాణాల్ని సైతం ఫణంగా పెడతారన్నారు. మీ డిమాండ్‌ను సీఎం వద్ద ప్రస్తావించా, సానుకూలంగా స్పందించారు. ముందు ఆందోళన మిరమింపచేస్తే, వారి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు హామీ ఇచ్చారు. నా గౌరవం నిలపండి. ఆందోళన విరమించి సీఎంతో చర్చలకు రండంటూ బలిమాలారు. అయితే మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చే బిల్లును అసెంబ్లీలో అమోదిస్తామన్న హామీ ఇవ్వకుండా కేవలం సీఎంతో చర్చలకు తీసుకెళతామంటూ ప్రకటించడం మత్స్యకారులను మభ్యపెట్టడమే నంటూ కొంతమంది మత్స్యకార ప్రతినిధులు, యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం దూతగా వస్తే ముందుగానే వారి అనుమతితో అసెంబ్లీలో తీర్మానంపై స్పష్టత తీసుకుని రావాల్సిందిగా సూచించారు. దీంతో టీడీపీ రాయబారం విషయంలో మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది చినరాజప్ప ఇచ్చిన హామీతో సంతృప్తి చెందుతున్నామని, సీఎంతో చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. మరో వర్గం మాత్రం అసెంబ్లీలో తీర్మానం పెట్టేలా హామీ ఇస్తేనే దీక్షలు విరమిస్తామంటూ స్పష్టం చేశాయి. వైసీపీకి చెందిన మత్స్యకార ప్రతినిధులు కోలా గురువులు, పేర్ల విజయచందర్, గౌరికిన గౌరి తదితరులు చినరాజప్ప హామీపై మండిపడ్డారు. దీనిపై టీడీపీ ఆనుకూల మత్స్యకార ప్రతినిధులు నీలకంఠం తదితరులు మాత్రం చినరాజప్ప దౌత్యంపై నమ్మకంతో దీక్ష విరమిస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మత్స్యకారులకు అనుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామంటూ ప్రకటించారు.