విశాఖ

విద్యుత్ కార్మికుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఫిబ్రవరి 23: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవదిక సమ్మె చేపట్టిన విద్యుత్ కంట్రాక్టు కార్మికులు అరకులోయ పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యల సాధన కోసం ఈ నెల 22వ తేది నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న కార్మికులు రెండో రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన విద్యుత్ కంట్రాక్టు కార్మికులు సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళనకు దిగి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మె శిబిరం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఇదిలాఉండగా నిరవదిక సమ్మె చేస్తున్న కార్మికులకు వైసీపీ నాయకులు కుంభా రవిబాబు, శెట్టి ఫల్గుణ, సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర, సి.ఐ.టి.యు. ప్రతినిధి వి.ఉమామహేశ్వరరావు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని వారు కోరారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే పోరాటానికి దిగుతామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మిక సంఘం నాయకులు అప్పలస్వామి, నిరంజన్, తిరుపతి, నగేష్, మోహన్, వైసీపీ నాయకులు అశోక్, ఆనంద్, గాసి తదితరులు పాల్గొన్నారు.