విశాఖపట్నం

నేడు సీఎం చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం నగరానికి రానున్నారు. ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ఉదయం 10.55 గంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం గుండా ఏపీఐఐసీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 4.30 గంటల వరకూ జరిగే ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటారు. అనంతరం సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట జరిగే సెషన్స్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఎంజీఎం పార్కులో భాగస్వామ్య సదస్సులో పాల్గొంటున్న అతిధులు, ఇతర ముఖ్య ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు హార్బర్ పార్కులోని పోర్టు అతిధిగృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. తిరిగి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో జరిగే భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమాలకు హాజరవుతారు. రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ అతిధులు, ప్రముఖులకు భారత పరిశ్రమల సమాఖ్య ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి పోర్టు అతిధిగృహంలో బసచేస్తారు. మూడో రోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.55 గంటల వరకూ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటారు. సదస్సు ముగింపు అనంతరం సాయంత్రం 4 నుంచి 4.55 గంటల వరకూ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ తిరిగి వెళతారు.

కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాక
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు శనివారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ వచ్చి నేరుగా ఏపీఐఐసీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.30 గంటల వరకూ సదస్సు ప్రాంగణంలోని హాల్ 2లో భాతర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతారు. అనంతరం భాగస్వామ్య సదస్సు ప్రారంభ వేడుకలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు హాల్ 5లో సీఎం చంద్రబాబు, తదితరులతో జరిగే చర్చలో పాల్గొంటారు. రాత్రికి నోవాటెల్ హోటల్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ వివిధ దేశాల నుంచి వచ్చిన వాణిజ్య శాఖల మంత్రులతో కలిసి అల్పాహార సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుంచి ఏపీఐఐసీ గ్రౌండ్స్‌కు చేరుకుని ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ హాల్ 1లో జరిగే ప్లీనరీ సెషన్స్‌లో పాల్గొంటారు. తిరిగి 11.15 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరిగే ప్లీనరీ సెషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హాల్ 5లో సీఎం చంద్రబాబుతో కలిసి చర్చలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు నోవాటెల్‌లో సీఐఐ ఇచ్చే విందులో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి పండిట్ రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్లీనరీలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.15 గంటల వరకూ జరిగే సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.