విశాఖపట్నం

ఇక్కడ సదస్సులు.. ఎక్కడో పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పారిశ్రామిక రాజధాని విశాఖ నగరంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వాలు చెపుతున్నా, అవి వాస్తవరూపం దాల్చడం లేదు. సువిశాల విశాఖ నగరంలో భూమి కొరత ఒక కారణమైతే, అధికారుల సమన్వయ లోపం మరొక సమస్యగా పరిణమించింది. 2016, 2017 సంవత్సరాల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. ఇందులో సుమారు 12 వేల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో విశాఖకు వచ్చిన పరిశ్రమలు ఎన్ని? ఏషియన్ పెయింట్స్, కాంకర్డ్ వంటి కంపెనీలు విశాఖ వచ్చినట్టు చెపుతున్నారు. వాస్తవానికి ఇవి భాగస్వామ్య సదస్సులకు ముందే జరిగిన ఒప్పందాలు. హెచ్‌పీసీఎల్ విస్తరణను ఈ ఒప్పందాల్లో చూపించారు. ఇంతకు మించి విశాఖకు ఒక్క కొత్త కంపెనీ అయినా వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కో భాగస్వామ్య సదస్సుకు ఎంత మ్యాన్‌పవర్ ఇక్కడ ఖర్చవుతోంది? సదస్సుకు ముందు, వెనుక పరిపాలనను పక్కనపెట్టి అధికారులు ఏర్పాట్లలలో తలమునకలై ఉంటున్నారు. ఇంత కష్టపడినా, విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా, అన్ని మిగిలిన జిల్లాలకు తరలిపోతున్నాయి. కేవలం విశాఖను సదస్సుల కోసమే వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో ప్రభుత్వ భూములు విక్రయించి, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు విశాఖను సదస్సుల కోసం వినియోగించుకుని, మిగిలిన జిల్లాల్లో పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదేం న్యాయం??
గతంలో జరిగిన భాగస్వామ్య సదస్సులలో సాకారమైన ఒప్పందాలకు సంబంధించిన కంపెనీల్లో కొన్ని నెల్లూరు శ్రీసిటీలోను, మరికొన్ని అనంతపురం జిల్లాలోను ఏర్పాటయ్యాయి. విశాఖలో కంపెనీలు ఎందుకు రావడం లేదన్న అంశంపై పారిశ్రామికవేత్తలను ప్రశ్నిస్తే, విశాఖలో భూమి కొరత తీవ్రంగా ఉందని చెపుతున్నారు. కొండలు, గుట్టలు ఉన్న భూమిని కంపెనీలకు ఇవ్వచూపుతున్నారని, వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడడం లేదని చెపుతున్నారు. అలాగే, వివాదాస్పద స్థలాలను కంపెనీలకు అంటకట్టాలని చూస్తున్నారని చెపుతున్నారు. అలాగే, ఏపీఐఐసీకి పూర్తి స్థాయిలో ఎండీ, ఈడీలు లేకపోవడం కూడా పెద్ద లోపమని అంటున్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని అధికారులు చెపుతుంటే, వాస్తవానికి వెనుకబడి ఉందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పరిశ్రమలు ఇక్కడికి రావడం లేదని వారు వివరిస్తున్నారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్థికి సంబంధించి కచ్చితమైన రోడ్ మ్యాప్ లేకపోవడం వలన ఇప్పటి వరకూ కారిడార్‌లో కదలిక రాలేదు. భాగస్వామ్య సదస్సును పురస్కరించుకుని కొద్ది రోజుల కిందటే, కలెక్టర్ దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ కారిడార్ పనులు పూర్తయ్యేటప్పటికి కనీసం మరో ఐదు, ఆరు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ-కాకినాడ మధ్య కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారు. కోస్టల్ కారిడార్‌లో ఫార్మా, పెట్రోలియం ఇండస్ట్రీస్ వస్తాయి. కానీ ప్రస్తుతం ఫార్మా రంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కోస్టల్ కారిడార్ కూడా ఇంతవేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
విశాఖను ఐటీ హబ్‌గా మార్చుతామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి విశాఖలో ఐటీ హబ్ గురించి మాట్లాడుతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఐటీ కార్యదర్శులు ఎంతో మంది మారారు. ఒక్కరు కూడా విశాఖ వచ్చి ఇక్కడ ఐటీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడలేకపోయారు. గడచిన రెండు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఐటీ కంపెనీ ఒక్కటి కూడా విశాఖకు రాకపోవడం శోచనీయం.
విశాఖను పర్యాటక కేంద్రంగా ప్రపంచానికి చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్థం చేస్తున్నారు తప్ప, అవి కార్యరూపం దాల్చడం లేదు. పర్యాటక రాజధాని అయిన విశాఖ నగరానికి గడచిన మూడున్నర సంవత్సరాల్లో ఒక్క పర్యాటక ప్రాజెక్ట్ కూడా రాకపోవడం దురదృష్టకరం. లక్షల కోట్ల ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం అయిపోయాయి. అధికారులు మాత్రం విశాఖకు మరిన్ని ఫైవ్ స్టార్ హోటల్స్, కానె్వన్షన్ సెంటర్స్ వచ్చేస్తున్నాయని చెపుతున్నారు. వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. విశాఖలో పర్యాటకాభివృద్థి జరగాలంటే, ముందు ఇక్కడున్న పర్యాటక శాఖను పూర్తిగా సంస్కరించాలి.