విశాఖపట్నం

మానవ వనరులపై కేంద్ర పరిశోధన బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 13: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో మానవ వనరులు, వౌళిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల సరళిని కేంద్ర పరిశోధన బృందం పరిశీలించింది. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బృందం గత మూడు రోజులుగా మానవ వనరులు, వౌళిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల సరళిని పరిశీలించి మండల స్థాయి అధికారులతో మంగళవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కేంద్ర పరిశోధన బృందం నాయకుడు ఆచార్య డి.సుందరరాం నాయకత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పెదలబుడు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలు, పత్రాలు, మానవ వనరుల స్థితిగతులను అంశాల వారీగా పరిశీలించారు. పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ సమర్డి గులాబి, పంచాయతీ కార్యనిర్వాహణ అధికారి అచ్యుతరావు, పంచాయతీ సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బృందం నాయకుడు సుందరరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి దత్తత పంచాయతీలోని 22 గ్రామాలు సమహారంగా ఉన్నాయని, వౌళిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి అవసరమైన నిధులు మంజూరు చేసినప్పటికీ గ్రామ పంచాయతీ మానవ వనరుల విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నట్టు తమ పరిశీలనలో గుర్తించామని చెప్పారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో ఇమిడి ఉన్న పెదలబుడు పంచాయతీ మరిన్ని వౌళిక వసతులతో పాటు మానవ వనరులు, ఆర్థిక వనరులు ఇతోధికంగా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెదలబుడు పంచాయతీకి ప్రభుత్వ నిధులతో పాటు స్థానికంగా ఆర్థిక వనరులు పెంచుకునేందుకు సినిమా స్టూడియో, వాహనాల పార్కింగ్, ఫీజు, గృహ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ పంచాయతీ భవిష్యత్తు అభివృద్ధికి పలు సూచనలు, సలహాలను ఇచ్చేందుకు పాలకవర్గ సభ్యులతో సమావేశమై బృంద శిఖర చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని ఆయన అన్నారు. దీనివలన పంచాయతీ అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదిన పంచాయతీ పరిధిలోని 22 గ్రామాలను సందర్శించి నేరుగా గిరిజనులతో కలిసి వారి జీవన స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నట్టు సుందరరాం చెప్పారు. కాగా, 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని 29 రాష్ట్రాలలో గ్రామ పంచాయతీలలో జాతీయ సర్వే నిర్వహిస్తున్నారు. పంచాయతీలలో అందుబాటులో ఉన్న మానవ వనరుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థల నేతృత్వంలో దేశ పంచాయతీ రాజ్ అధికారులు కాలమానం, పని స్థితిగతులపై సర్వే చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో జరుగుతున్న జాతీయ సర్వేను భారత గ్రామీణ అధ్యయనం, పరిశోధనల అకాడమీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశోధన బృందం సభ్యులు సాయికుమార్, భగవాన్‌రెడ్డి, ఎం.పి.డి.ఒ. ఎం.విజయకుమార్, ఇ.ఒ.పి.ఆర్.డి. మల్లిఖార్జునరావు, వైస్ ఎం.పి.పి. పొద్దు అమ్మన్న, తదితరులు పాల్గొన్నారు.

లఘుచిత్రం ద్వారా విద్యార్థులకు ఓ.డి. ఎఫ్.పై అవగాహన
కోటవురట్ల, మార్చి 13: మండలంలో ఆర్.సి.పురం ఎంపీయుపీ స్కూల్ ,లింగాపురం ఎంపీపీ పాఠశాలల్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విద్యార్థులకు ఓ.డి ఎఫ్ .పై అవగాహన కల్పించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో బహిరంగ మలమూత్ర విసర్జన వలన వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు. అలాగే ఓ.డి. ఎఫ్.పై ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని వివరించారు. ఈసందర్భంగా ఫ్రధానోపాధ్యాయులు పి.డేవిడ్, కృష్ణ మాట్లాడుతూ ఓ.డి. ఎఫ్.పై విద్యార్థులకు షార్ట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. విద్యార్థులు తల్లిదంఢ్రులకు ఓ.డి. ఎఫ్.పై అవగాహన కల్పిస్తారన్నారు.

మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
కొయ్యూరు, మార్చి 13: 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏజన్సీ డి. ఇ. ఓ. జ్యోతికుమారి హెచ్చరించారు. మంగళవారం మండలానికి వచ్చిన ఆమె మూడు పరీక్షా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించారు. గురుకుల పాఠశాల కేంద్రంలో ఫ్యాన్లు లేక పోవడంతో వాటిని ఏర్పాటు చేయాలనే ఎం. ఇ. ఓ.కు సూచించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏజన్సీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్షా కేంద్రాల్లో 5,659 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారన్నారు. పాడేరులో మూడు, చింతపల్లి 1, అరకు 1 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వీటిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసామన్నారు. పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే వారు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థి, ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.