విశాఖపట్నం

హోదాపై అన్ని పక్షాలతో పోరు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పోరాటాన్ని ఉదృతం చేస్తామని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సి.హెచ్.నర్సింగరావు చెప్పారు. స్థానిక గిరిజన భవన్‌లో మంగళవారం నిర్వహించిన సి.పి.ఎం. జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పించాలని రాజ్యసభలో డిమాండ్ చేసిన బి.జె.పి. అధికారంలోకి వచ్చాక దీనిని విస్మరించి తెలుగు ప్రజలకు ద్రోహం చేయడం సహించరానిదని ఆయన చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా బి.జె.పి.తో చెట్టాపట్టాలేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం హోదా సాధించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మోసం చేస్తుందని తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఆలస్యంగా మేల్కోవడం వలన రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా నష్టపోవలసి వచ్చిందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజి మేలని చెప్పిన చంద్రబాబు చివరికి దీనిని కూడా సాధించలేక తన అసమర్థతను చాటుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య, నిరంకుశ వైఖరి వలన ఐదు కోట్ల ఆంధ్రుల భవితవ్వం ప్రమాదకరంగా మారిందని, యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని నరసింగరావు ఆందోళన వ్యక్తం చేసారు. అయితే కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహన్ని తాము చూస్తూ ఊరుకోజాలమని ఆయన చెప్పారు. తమ పార్టీ సారధ్యంలో అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ప్రత్యేక హోదాపై ఉద్యమబాట పట్టేందుకు కార్యాచరణ తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ రైల్వే జోన్, గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేసారు. విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ అంశం స్పష్టంగా ఉన్నప్పటికీ బి.జె.పి. పాలకులు ఇది సాధ్యం కాదని చెబుతుండడం వారి ధ్వంద నీతికి అద్దం పడుతున్నట్టు ఆయన విమర్శించారు. అయితే అన్ని రాజకీయ పక్షాలతో తాము చేపట్టబోయ ఉద్యమంలో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను సాధించేందుకు సమాయత్తవౌతున్నట్టు ఆయన చెప్పారు. విశాఖ గిరిజన ప్రాంతంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో ప్రతి గిరిజన గ్రామంలో దాహం కేకలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. మంచినీటి సౌకర్యానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు చెబుతున్న పాలకులు ఈ నిధులు ఎక్కడ ఖర్చు చేసారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, బహిరంగ మార్కెట్‌లో పిక్క తీసిన చింతపండు కిలో 160 రూపాయల ఉండగా, జి.సి.సి. పిక్కతో ఉన్న చింతపండును కిలో 25 రూపాయలకు కొనుగోలు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. చింతపండుకు కిలో 50 రూపాయల ధరను ప్రకటించాలని, ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. క్షేత్ర స్థాయిలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సి.పి.ఎం. కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నర్సింగరావు కోరారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, పాడేరు, అరకు డివిజన్ నాయకులు ఆర్.శంకరరావు, కిల్లో సురేంద్ర, యు.ఉమామహేశ్వరరావు, బి.సి.హచ్.పడాల్, బొండా సన్నిబాబు, పి.శాస్ర్తీబాబు, డి.గంగరాజు, దయానిధి, ఎల్.సుందరరావు, ఏజెన్సీలోని అన్ని మండలాల కామేడ్ల్రు పాల్గొన్నారు.

కాఫీ సాగుతోనే ఆర్థిక ప్రగతి
ఐ.టి.డి.ఎ. పి.ఒ. రవిసుభాష్
పాడేరు, మార్చి 13: గిరిజనులు తమ ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకునేందుకు కాఫీ సాగును చేపట్టాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ సూచించారు. హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ ఆమూరు గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించి గ్రామంలో చేపడుతున్న కాఫీ సాగును, ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ ప్రాధమిక నర్సరీని పరిశీలించారు. కాఫీ సాగు వలన కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ మన్యంలో కాఫీ సాగును పెద్ద ఎత్తున చేపడుతున్నామని, ఇప్పటికే అనేక మంది గిరిజన రైతులు ఈ సాగు పట్ల మక్కువ చూపిస్తున్నారని చెప్పారు. గతంలో కాఫీకి దూరంగా ఉన్న రైతులు కూడా దీని వలన కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించి కాఫీ పెంపకానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. కాఫీ సాగుకు దూరంగా ఉన్న గిరిజనులంతా దీని పెంపకానికి ముందుకు వస్తే ఐ.టి.డి.ఎ. వారికి అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. కాఫీ సాగును చేపడుతున్న రైతులు ఆర్థికంగా బలోపేతవౌతూ అభివృద్ధిని సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆమూరు గ్రామ గిరిజనులతో ఆయన సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో సామాజిక భవనం నిర్మించి, గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాలని, తమ గ్రామానికి వచ్చే రహదారిలో గెడ్డపై వంతెన నిర్మాణం చేయాలని గిరిజనులు కోరారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతి గిరిజనుడు వ్యక్తిగత మరుగుదొడ్లను తప్పనిసరిగా నిర్మించుకోవాలని రవిసుభాష్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాఫీ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.