విశాఖపట్నం

వేడెక్కిన ‘జోన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రకటించడంతో విశాఖలో నిరసనలు హోరెత్తాయి. జోన్ ఇవ్వనందుకు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తెలుగుదేశంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలియచేశాయి. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద దక్షిణ నియోజకవర్గ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటికే రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. టీడీపీ నేతల ఆందోళనను వారు అడ్డుకున్నారు. అలాగే గురుద్వార్ జంక్షన్, తదితర ప్రాంతాల్లో టీడీపీ నిరసనలు తెలిపింది.
సీపీఐ, సీపీఎం విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, నమ్మకద్రోహానికి పాల్పడిన బీజెపీ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీపీఎం కార్యదర్శి బీ.గంగారావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో విభజన హామీలు అమలుచేస్తామని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని, అధికారం చేపట్టిన తరువాత జోన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాల్గవ బడ్జెట్‌లోనైనా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటిస్తారేమోనని ఎంతో ఆశతో ఎదురుచూసిన విశాఖ ప్రజానీకానికి నిరాశే మిగిల్చారన్నారు. ఏపీకి సంబంధించి ఇచ్చి ఏ హామీలను అమలు చేయకపోయినా చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, నగర కమిటీ సభ్యులు కృష్ణారావు, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జెడీ నాయుడు, సత్యాంజినేయు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.