విశాఖపట్నం

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 26: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వెల్లడించారు. శనివారం కొణతాల మాడుగుల మండలం వెళుతున్న సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలో రహదారిపై నిల్చుని ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన కొణతాల కారు దిగి వారి వద్దకు వచ్చి అభిమానులను పరామర్సించారు. ఈ సందర్భంలో కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం ఉత్తరాంధ్రలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో కూడా ప్రధానమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోకపోవడం వలన ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అభిమానుల సూచనల మేరకు కొత్త సంవత్సరంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. జనవరి మొదటివారంలో మీ తాజా నిర్ణయం ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అభిమానుల అభీష్టం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని చెప్పి ఆయన మాడుగుల పయనమయ్యారు. ఆయనను కలిసిన అభిమానుల్లో ప్రముఖ న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, పివిజి కుమార్, బొడ్డేడ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

జన్మభూమి - మనవూరు కార్యక్రమం విజయవంతం చేయండి
* అధికారులకు కమిషనర్ ఆదేశం

విశాఖపట్నం, డిసెంబర్ 26: నగర పరిధిలో జనవరి 2 నుంచి 10 వరకూ జరగనున్న జన్మభూమి - మనవూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంపై అధికారులతో శనివారం సమీక్షించిన కమిషనర్ వార్డుల వారీగా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గత జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన వినతులు, పరిష్కరించిన సమస్యలపై నివేదిక రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుత జన్మభూమిలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించాలన్నారు. నూతన గృహాల మంజూరు, పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, స్వయం ఉపాధి శిక్షణ దరఖాస్తులు తదితర అంశాలపై పూర్తి వివరాలతో జన్మభూమి సభలకు హాజరుకావాలన్నారు. అలాగే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ల (ఎస్‌ఎల్‌ఎఫ్)లకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ విశాఖ తదితర కార్యక్రమాలపై స్వయం సహాయక సంఘాలు, ఎస్‌ఎల్‌ఎఫ్‌లను భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్లు జివివిఎస్ మూర్తి, మోహనరావు, జోనల్ కమిషనర్లు, ఎపిడిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.