విశాఖపట్నం

సింహాచలేశుని పాకశాల కిటికీలో గుట్కా ప్యాకెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 15, దక్షిణ భారతదేశంలో ప్రముఖ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి ప్రసాదాలు తయారు చేసే పాకశాల ( వంటశాల ) కిటికీలో గుట్కా ప్యాకెట్టు దర్శనమిచ్చింది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రాతితో నిర్మించిన పాకశాల పరిశుభ్రత పట్ల కైంకర్య పరులు వ్యవహరిస్తున్న తీరుకు అసంతృప్తితో ఉన్న ఈవో రామచంద్రమోహన్ గురువారం ఉదయం పాకశాల పరిసరాలను పరిశీలించారు. ఈ నేపధ్యంలో కిటికీలో ఉన్న చెత్తాచెదారాన్ని బయటకు తీయించారు. ఈ చెత్తలో గుట్కా ప్యాకెట్టు బయటపడింది. ఈవో స్వయంగా కైంకర్య పరులను పిలిపించి బయటకు తీయించి పరిశీలించారు. గుట్కా ప్యాకెట్టును చూసి ఈవో ఆగ్రహంతో ఊగిపోయారు. పరమ పవిత్రంగా ప్రసాదాలను తయారు చేయాల్సిన పాకశాలలో గుట్కా ప్యాకెట్టు కనిపించడాన్ని ఈవో జీర్ణించుకోలేకపోయారు. ఎక్కడకు వెళ్లిపోతోంది ఈ దేవాలయం అంటూ ఈవో అసహనం వ్యక్తం చేసారు. వంటశాల సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఓ భక్తురాలు అంతరాలయంలో ఉంటుండగానే సింహాచలేశునికి మధ్యాహ్నం రాజభోగం సమర్పించేందుకు వైదికులు సిద్ధపడ్డారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈవో విచారణ జరుపుతున్న నేపధ్యంలో వంటశాలలో గుట్కా ప్యాకెట్టు వ్యవహరం బయటకు రావడంతో ఈవో రామచంద్రమోహన్ మరింత అసహనానికి గురయ్యారు. ఆచార, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పుకొనే సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న అపచారాల పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఈవో రామచంద్రమోహన్ విలేఖరులకు వివరణ ఇచ్చారు. ఉదయం నుండి సిసి కెమెరాల్లోని పుటేజీలను పరిశీలించామని మధ్యాహ్నం 11 గంటల 39 నిమిషాల నుండి 11 గంట 52 నిమిషాల వరకు ఒక భక్తురాలు దేవాలయం లోపలే ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఈవో చెప్పారు. ఈ విషయమై ఆ రోజు విధులు నిర్వహిస్తున్న వైదికులను విచారించడం జరిగిందని ఈవో తెలియజేసారు. భక్తురాలు ఉన్న విషయాన్ని గమనించి లోపలికి వచ్చిన ప్రసాదం గినె్నలకు తెరచాటు వేయడం జరిగిందని మహిళ బయటకు వెళ్లిన తరువాతే స్వామివారికి ప్రసాదం నివేదన చేసారన్న విషయం వైదికులు చెబుతున్నట్లు ఈవో చెప్పారు. మహిళ ఉంటుండగా నివేదన చేసి ఉంటే అపచారమయ్యేదని ఆయన అన్నారు. ఈ సంఘటనను విధుల పట్ల నిర్లక్ష ధోరణిగానే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధ్యులైన అందరి ఉద్యోగుల వద్ద లిఖిత పూర్వకంగా వివరణలు తీసుకున్నామని నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కి పంపుతామని ఈవో విలేఖరులకు వివరించారు.