విశాఖపట్నం

ఆర్డీఓ వెంకటేశ్వర్లుపై క్రిమినల్ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 16: విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లుపై క్రిమినల్ చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయన విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక చోట్ల అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో ఏ పోలీస్ స్టేషన్‌లో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నది అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు, లేదా సంస్థలకు ధారాదత్తం చేసిన వ్యవహారాలు ఇప్పటి వరకూ 11 బయటపడ్డాయి. ఆనందపురం మండలం వేములవలసగ్రామం సర్వే నెంబర్ 39/5కు సంబంధించి 11.14 ఎకరాల భూమిపై గత ఏడాది అక్టోబర్ ఐదవ తేదీన ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్‌ఓఆర్ అపిలెట్ అథారిటీగా భీమిలి మండలం దాకమర్రి, కాపులుప్పాడ గ్రామాల్లో సింహాచల దేవస్థానానికి చెందిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఆర్డీఓ వెంకటేశ్వర్లు కట్టబెట్టారు. ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం, రామవరం గ్రామంలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసినట్టు అధికారులు గుర్తించారు. భీమిలి మండలంలో 288/2016 సర్వే నెంబర్‌లోని భూమి విషయంలో ఆర్డీఓ అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈనాం అప్పిలెట్ అథారిటీ హోదాలో పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో సర్వే నెంబర్.30, విశాఖ రూరల్ మండలం అడివివరం గ్రామం లోని సర్వే నెంబర్ 197, పెందుర్తి మండలంలోని 107/11 సర్వే నెంబర్‌లో ఆర్డీఓ వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినందున అతినిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఆర్డీఓ వెంకటేశ్వర్లుకు సహకరించినందువలన రావికమతం తహశీల్దార్ సిద్దయ్యను సీసీఎల్‌క సరెండర్ చేశారు. అయితే, ఈ 11.4 ఎకరాల భూ బదలాయింపునకు సంబంధించి నర్సీపట్నం ఆర్డీఓకు ఎటువంటి సంబంధం లేదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు కేవలం ఈ 11 కేసులలోనే కాదు, డివిజన్‌లోని అన్ని చోట్లా తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తితో వెంకటేశ్వర్లుకు సత్ సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డంపెట్టుకుని ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా అనేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విశాఖ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరెండర్ అయిననాటి వరకూ నడిపిన ఫైళ్లన్నంటిపైనా ఇప్పుడు దర్యాప్తు జరగబోతోంది. పోలీస్ దర్యాప్తు జరిపితే, వెంకటేశ్వర్లు అవకతవకలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు.