విశాఖ

జగన్ పోరు, పవన్ దీక్షలతో ‘బాబు’కు కంగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 17: ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి పోరాటం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు దడపుట్టిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ, జనసేన ఉద్యమాలతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే టీడీపీకి రాష్ట్రంలో అడ్రస్ గల్లంతవుతుందన్న భయం చంద్రబాబులో మొదలైందన్నారు. ఎవరి వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినా స్వాగతించాలని, అయితే హోదా పోరును పక్కదారి పట్టిస్తూ నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు తీరును ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన రాజకీయ స్వలాభం కోసం కుతంత్రాలకు తెరతీస్తున్నారన్నారు. తనపై ఉన్న కేసులు బయటకు రాకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇతరులపై బురదజల్లుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో కమిషన్ల కోసం చంద్రబాబు అండ్ కో విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ప్రశ్నిస్తోంటే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. తమకు తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, హోదా అంశాన్ని రాజకీయ కోణంలో తాము చూడట్లేదన్నారు. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు వచ్చే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించనున్నట్టు బొత్స వెల్లడించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, కరణం ధర్మశ్రీ, పార్టీ ప్రతినిధులు కల్యాణి, పక్కి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగావకాశాలు
* ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి
విశాఖపట్నం, మార్చి 17: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ స్థాయిలో యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి అన్నారు. నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్‌ఫెయిర్‌లో 32 ఐటీ కంపెనీలు పాల్గొని 179 మందికి ఆఫర్ లెటర్స్ అందించాయన్నారు. మరో 519 మంది అభ్యర్థులకు తదుపరి ఎంపిక నిమిత్తం ఎంపిక చేసినట్టు వెల్లడించారు. గీతం యూనివర్శిటీ, గాయత్రి విద్యా పరిషత్, తదితర కళాశాలల్లో కేంపస్ ఇంటర్వూల ద్వారా పలువురిని ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే గాయత్రి విద్యాపరిషత్‌లో స్టార్టప్ కంపెనీల నిమిత్తం విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అనంతపురంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు తెలిపారు. నూతన సాంకేతికను తెలుసుకునేందుకు విద్యార్థులకు హ్యాక్‌థాన్‌లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. వారిని హైఎండ్ ప్రాసెస్‌లో భాగస్వామ్యం చేయడం, హ్యాక్‌థాన్ వంటివి విద్యార్థులకు లాభం చేకూరుస్తాయన్నారు. సమావేశంలో అడిషనల్ సీఈఓ ఐటీ అకాడెమీ వినయ్ పాత్రో, ఐటీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ్ధర్ కొసరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఈఎన్‌సీని సందర్శించిన శ్రీలంక నేవీ వైస్ అడ్మిరల్
విశాఖపట్నం, మార్చి 17: శ్రీలంక నౌకాదళం వైస్ అడ్మిరల్ సిరిమేవన రణసింఘే నలుగురు సభ్యుల బృందంతో మూడు రోజుల పర్యటన నిమిత్తం తూర్పునౌకాదళాన్ని సందర్శించారు. రణసింఘే తన రెండో రోజు పర్యటనలో భాగంగా తూర్పునౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌తో శనివారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పర్యటనలో శ్రీలంక బృందం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ సత్పుర, ఐఎన్‌ఎస్ విశ్వకరమ్‌లను నేవల్ డాక్‌యార్డులో పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమసంఘే మాట్లాడుతూ భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు 2,500 ఏళ్ల ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నాయన్నారు. సంస్కృతి, జాతి తదితర అంశాల్లో ఈ సంబంధం ఎంతో బలంగా ఉందన్నారు. తాజాగా రెండు దేశాల మధ్య నౌకాదళం పరంగా పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఎంతో దోహదం చేసిందన్నారు. నౌకాదళ పరంగా ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించాయన్నారు