విశాఖపట్నం

ముస్సోరి శిక్షణకు కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 20: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శిక్షణ నిమిత్తం ముస్సోరి వెళ్లనున్నారు. వచ్చే నెల 9 నుంచి 25 రోజుల పాటు ఆయన శిక్షణ తీసుకోనున్నారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జిల్లాలోనే వివిధ స్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్‌గా విశాఖలో బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌కుమార్ దాదాపు ఏడాదిన్నర కాలం మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ప్రభుత్వం జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌కు పదోన్నతి కల్పించి కలెక్టర్‌గా నియమించింది. దాదాపు ఏడాదికి పైగా ప్రవీణ్‌కుమార్ కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హుదూద్ తుపాను సమయంలో సంయుక్త కలెక్టర్‌గా పనిచేస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడటంతో ఆయనున్న తొలుత జీవీఎంసీ కమిషనర్‌గాను, అనంతరం కలెక్టర్‌గాను బాధ్యతలు అప్పగించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న ప్రవీణ్‌కుమార్ ఎన్నికల వరకూ జిల్లాలోనే ఉంటారని భావించారు. అయితే అనూహ్యంగా శిక్షణకు వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా ముస్సోరి శిక్షణ ముగించుకున్న కలెక్టర్లు ఎవరూ తిరిగి పాత స్థానాల్లో నియమితులైన దాఖలాల్లేవు. ఇదే సంప్రదాయం కొనసాగితే ప్రవీణ్‌కుమార్ బదిలీ కూడా తప్పదు.
జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతానికి కొత్తగా ఎవరినీ నియమించే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. సంయుక్త కలెక్టర్ సృజనకు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా సంయుక్త కలెక్టర్ సృజనకు బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వంలో ఒక వర్గం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో భూ కుంభకోణం విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్‌లో జేసీ సభ్యురాలు. సిట్ దర్యాప్తులో రెవెన్యూ పరంగా ఆమె కీలకంగా వ్యవహరించారు కూడా. ఇక తాజాగా సంచలనం సృష్టించిన ఆర్డీఓ వెంకటేశ్వర్లు వివాదస్పన ఆర్డర్ల విషయంలో కూడా జేసీ సృజన నిబంధనల మేరకు వ్యవహరించారు. దీంతో అడ్డగోలుగా ఆర్డర్లు ఇచ్చిన ఆర్డీఓ వెంకటేశ్వర్లు తీరు వివాదస్పదమైంది. ఇది ప్రభుత్వానికి ఒకింత చెడ్డపేరు తెచ్చిందని అధికార పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ముక్కుకు సూటిగా నడచుకునే సృజనకు అధికారం అప్పగిస్తే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి.