విశాఖపట్నం

‘లులూ’కు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 20: స్థానిక హార్బర్ పార్క్ వద్ద ఉన్న ఏపీఐఐసీ భూమిలో లులూ గ్రూప్ నిర్మించనున్న కనె్వన్షన్ సెంటర్‌ను న్యాయపరంగా ఎవ్వరూ అడ్డుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీనికి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌కేప్)తో హైకోర్టులో కేవియట్ దాఖలు చేయించింది. అత్యంత విలువైన ఏపీఐఐసి భూమిని లులూ గ్రూపునకు అప్పగించడాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ నిర్మాణం వివాదాస్పదమైంది. ఈ నిర్మాణాన్ని అడ్డుకునే అవకాశం ఉన్న వైసీపీ నాయకులు మళ్ల విజయప్రసాద్‌కు, వంశీకృష్ణ శ్రీనివాస్‌కు, సీపీఐ నాయకుడు ఎం.పైడిరాజు, సీపీఎం నగర కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌కు హైకోర్టు నుంచి కేవియట్ నోటీసులు అందాయి. ఈనెల ఐదవ తేదీనే వీరికి ఈ నోటీసులు అందినట్టు తెలుస్తోంది.
ఇన్‌కేప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎం వెంకటేశ్వర్లు హైకోర్టులో ఈ కేవియట్ దాఖలు చేశారు. స్థానిక ఏపీఐఐసీ స్థలంలో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 25-07-2017న లులూ సంస్థకు లేటర్ ఇంటెంట్ జారీ చేస్తూ, జిఓ 116ను విడుదల చేసింది. సీఎంఆర్ సంస్థకు చెందిన 3.40 ఎకరాల భూమిని కూడా ఈ కనె్వన్షన్ సెంటర్ కోసం తీసుకోడానికి సదరు సంస్థ నుంచి అంగీకారం తీసుకుందని హైకోర్టుకు నెట్‌కేప్ తెలియచేసింది. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసే రిట్‌పిటిషన్లను స్వీకరించవద్దని, నిర్మాణం నిలిచిపోతే, పబ్లిక్ ఇంట్రస్ట్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ కనె్వన్షన్ సెంటర్ నిర్మాణంపై జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ ఐదును, జీఓ ఆర్‌టీ నెంబర్ 116కుపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కేవియట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లులూ సంస్థ సుమారు 2000 కోట్ల రూపాయలతో 13 ఎకరాల్లో నిర్మించనున్న కనె్వన్షన్ సెంటర్‌లో ఏడు వేల మంది కూర్చునేందుకు వీలుంటుంది. 20 లక్షల ఎస్‌ఎఫ్‌టీ కలిగిన షాపింగ్ మాల్, రెండు లక్షల ఎస్‌ఎఫ్‌టీ కలిగిన హైపర్ మార్కెట్, లగ్జరీ హోటల్, 11 స్క్రీన్‌ల మల్టీప్లక్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, 2500 సీటింగ్‌తో ఫుడ్‌కోర్ట్ ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు గత నెల 24న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ 2021నాటికి పూర్తి కానుంది.