విశాఖపట్నం

నీటి ఎద్దడి నివారించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మార్చి 24: వేసవి వస్తుంది... అన్ని గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కుకుగా ఉంది. అధికారులు స్పందించి తక్షణమే నీటి కోరత లేకుండా చూడాలంటూ జిల్లా పరిషిత్ సభ్యులంతా నిరసన గళం వినిపించారు. శనివారం జిల్లా పరిషిత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి, జెడ్పీ సీ ఇ ఓ జయప్రకాష్ తదితరలు పాల్గొన్నారు. ముందుగా స్థాయి సంఘ సమావేశంలో జరిగిన అంశాలను సభ్యులంతా ఎకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భీమిలీ జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ మండలంలో ప్రతి పంచాయతీకి ఒక బోరు అందుబాటులో ఉంచాలని, ఉన్న వాటిని మరమ్మత్తులు చేయించాలని కోరారు. అలాగే గొలుగోండ మండలం కృష్ణాదేవిపేట గ్రామంలో మంచినీటి కోరత తీవ్రంగా ఉందని అధికారులు స్పందించి తక్షణమే నీటి కోరత లేకుండా చూడాలన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాలలో అధికంగా నీటి ఎద్దడి సమస్యలు ఉన్నాయని కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద వహించి గిరిజనులకు తక్షణమే నీటి కోరత లేకుండా చూడాలన్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గతంలో సభ్యులు ఆడిగిన ప్రశ్నలకు సమాధానలను డి ఎం హెచ్ ఓ డాక్టర్ రమేష్ సమాధానమిచ్చారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ముంచిగ్‌పుట్ మండలోని పీహెచ్‌సీ వైధ్యాధికారి సక్రమంగా విధులకు హాజరుకావటం లేదని సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డి ఎంహెచ్ ఓ డాక్టర్ రమేష్ తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం డ్వామా పనులకు సంబంధించి నిధులు మంజూరు, పనులు చేసిన వాటికి మంజూరు చేయాల్సిన వాటిపై చర్చించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు మూడు కోట్ల రూపాయాలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని, మరో ఐదు కోట్ల రూపాయాలు అత్యవసర పనులకు సంబంధించి నిధులు కేటాయించాలని ఫ్రభుత్వాన్ని కోరామన్నారు. అనంతరం పలు శాఖలకు చెందిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
* ప్రత్యేక హోదాపై సభలో వైసీపీ సభ్యులు తీర్మానం
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా జరుగుతున్న పలు నిరసనల నేపధ్యంలో రాష్ట్రానికి విభజన హామీల అమలు, రైల్వే జోన్ తదితర అంశాలను తక్షణమే అమలు చేయాలని వైసీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని తొలుత ఆమోదించని పాలకవర్గం చైర్మన్, అనంతరం తప్పనిసరి పరిస్థితులలో సభ్యుల కోరక మేరకు ఆమోదిస్తూ చప్పట్లు కోట్టి తీర్మానించారు. ఈ విషయంపై జిల్లా పరిషిత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
* పూర్వ జెడ్పీచైర్మన్‌లకు ఘన సన్మానం
జిల్లా పరిషిత్ వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకూ పని చేసిన జిల్లా పరిషిత్ చైర్మ్‌న్‌లను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు చెందిన వారు ప్రస్తుతం ఉన్న వారిని జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ భాస్కర్ వినూత్నంగా సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి జెడ్పీచైర్‌పర్స్‌న్ కుటంబాలకు చెందిన వారసులు, జిల్లా పరిషిత్ చైర్‌పర్స్‌న్ వంజంగి కాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాసరావులు పాల్గొన్నారు. వీరిందరికీ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సిరి, జెడ్పీ సీ ఇ ఓ , టీడీపీ సీనియర్ నాయకులు లాలం భాస్కరరావుల చేతుల మీదుగా సన్మానించారు. అలాగే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా గత పాలకవర్గ సభ్యులు, దేశ నాయకలులు, మంత్రుల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో కూడిన ఫోటోలు అందరనీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఇదే ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు,గాంధీ చిత్రపటాలను ఆయిల్ పేయింటింగ్స్‌తో ప్రత్యేకంగా రూపోందించిన చైర్‌పర్స్‌న్ కుమారుడు లాలం భరత్‌ను కూడా ఘనంగా సన్మానించారు.