విశాఖపట్నం

డిఎంహెచ్‌ఒ కార్యాలయం తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మే 8: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని కలెక్టర్ యువరాజ్ ఆదివారం తనిఖీ చేశారు. డిఎంహెచ్‌ఒ సరోజినితో కలసి కార్యాలయంలో ప్రతి విభాగాన్ని సందర్శించారు. కార్యాలయానికి నూతన భవనం అవసరమా? మరమ్మతులు చేపడితే సరిపోతుందా? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ఉండే ప్రాంతీయ ఆయుష్ కార్యాలయాన్ని మధురవాడకు ఎందుకు తరలించారు? ఇప్పుడు ఇక్కడికి తరలిస్తే స్థల సమస్య ఏర్పడుతుందా? అని డిఎంహెచ్‌ఒ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్లాన్ రూపొందించాలని ఎపిఎండిసి ఇఇని ఆదేశించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రీజనల్ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం శెలవు రోజులో ఆకస్మిక తనిఖీలు జరపడంతో సిబ్బంది ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణరావు, వేంకటేశ్వరరావు, శ్రీనివాస్, డెమో ఇన్‌ఛార్జి ధనలక్ష్మి, రత్నకుమార్ పాల్గొన్నారు.