విశాఖ

హక్కుల కోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆంధ్రుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు చెప్పారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్ర నిరసన తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 20 నుంచి రిలే నిరాహర దీక్ష, సైకిల్ యాత్రలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపడుతున్న నిరాహర దీక్షకు సంఘీభావంగా అరకులోయలో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21వ తేది నుంచి నియోజకవర్గమంతటా సైకిల్ యాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 27వ తేది వరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సైకిల్ యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బి.జె.పి.తో పొత్తు పెట్టుకోవడం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు ప్రజలకు వివరించి చైతన్యం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రానికి బి.జె.పి. చేసిన నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరనున్నట్టు ఆయన చెప్పారు. ప్రతి గ్రామం నుంచి కనీసం పది మంది నిరాహర దీక్ష, సైకిల్ యాత్రలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులోభాగంగా ఈ నెల 18వ తేది బుధవారం అరకులోయలో దేశం పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నిరసన కార్యక్రమాలు ఏవిధంగా చేపట్టాలన్న అంశంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని సర్వేశ్వరరావు పేర్కొన్నారు. అనంతరం నిరాహర దీక్ష శిబిరాల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు పొద్దు అమ్మన్న, వంతాల పూర్ణ, సమర్డి రఘునాధ్, బి.బి.నాగేశ్వరరావు, అప్పాలు, రాజ్‌కుమార్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం చెల్లించాలని ధర్నా
పాడేరు, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాలలో ప్రాధమిక వైద్య సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. తమకు కనీస వేతనంగా ఆరు వేల రూపాయలను చెల్లించాలని, యూనిఫాం అలవెన్స్ ఇవ్వాలని వారు నినాదాలు చేసారు. తమ డిమాండ్లపై ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేసారు. అనంతరం ఐ.టి.డి.ఎ. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నాయకుడు ఆర్.శంకరరావు, ఆశ కార్యకర్తల సంక్షేమ సంఘం నాయకులు కొండమ్మ, పి.గాసమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను విజయవంతం చేయాలి
పాడేరు, ఏప్రిల్ 17: ఈ నెల 25 నుంచి విద్యార్థులతో నిర్వహించనున్న వేసవి శిబిరాలను విజయవంతం చేయాలని స్థానిక శాఖా గ్రంధాలయ అధికారి ఎం.సత్యవతి కోరారు. వేసవి శిబిరాలను విజయవంతం చేయాలని అక్షర పాఠశాల విద్యార్థులతో మంగళవారం పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 రోజుల పాటు నిర్వహించే వేసవి శిబిరాలలో విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆశక్తిని పెంపొందిస్తామని చెప్పారు. ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు విద్యార్థులకు మాత్రమే వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా వివిధ రకాల కథలు చెప్పి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని గుర్తించనున్నామని ఆమె అన్నారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు పలు పోటీలు నిర్వహిస్తామని, మానసిక ఉల్లాస కార్యక్రమాలను ఏర్పాటు చేసామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.