విశాఖపట్నం

ఆరోగ్యవంతమైన సమాజానికి వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, ఏప్రిల్ 17: ఆరోగ్యవంతమైన సమాజానికి ఎంపీఎం ట్రస్టు కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్ సేవా సమితి ట్రస్టుతో కలిసి ఎంపీఎం ట్రస్టు జీవీఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా మంగళవారం 36వ వార్డు కంచరపాలెం నేతాజీ గ్రంధాలయంలో నిర్వహించిన శిబిరాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు వీలవుతుందని, తద్వారా సకాలంలో వైద్యం అందించవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎంపీఎం ట్రస్టు ఉచిత వైద్య శిబిరాలపై దృష్టి సారించిందన్నారు. ఈ శిబిరాల్లో మూత్రపిండాల సమస్యలు, స్ర్తిల సమస్యలు, క్షయ, మోకాళ్ల అరుగుదల, గుండె జబ్బులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాల్లో అత్యధికంగా కంటి, వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు వస్తున్నారన్నారు. మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో 150 మందికి దంత పరీక్షలు, 200 మందికి కంటి వైద్య పరీక్షలు, 100 మందికి స్ర్తి సంబంధిత వ్యాధుల పరీక్షలు, 200 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. జిమ్‌సర్ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఈ శిబిరాల్లో పాల్గొన్నారు.