విశాఖ

ప్రత్యామ్నాయ పంటలపై రైతులు తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఏప్రిల్ 24: విశాఖ గ్రామీణ జిల్లాలోని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన వాణిజ్యపంట చెరకు. ఈ పంట ఆధారంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గడచిన కొంతకాలంగా బెల్లం ధరలు నిరాశాజనకంగా ఉండటం, సాగు ఖర్చులు పెరిగిపోవడం, చెరకుకు తెగుళ్లు సోకడం తదితర కారణాల వలన చెరకు సాగు పట్ల రైతుల్లో క్రమేపీ విముఖత పెరుగుతోంది. కాయకష్టం సైతం దక్కని పరిస్థితులతోపాటు ప్రధానంగా కూలీల కొరతతో ఈ పంటల సాగుపట్ల రైతులు మొహం చాటేస్తున్నారు. జిల్లాలోని క్రమేపీ చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతుండటం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. 50వేల హెక్టార్లుగా ఉండే చెరకు సగటు సాగు విస్తీర్ణం 40వేల హెక్టార్లకు తగ్గిపోయింది. తుమ్మపాల ఫ్యాక్టరీ మూతపడటం, జిల్లాలోని ఇతర సుగర్ ఫ్యాక్టరీలు నిరాశాజనక ధరలు చెల్లించడం, మరోవైపు బెల్లానికి సైతం గిట్టుబాటు ధర లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఎకరం భూమిలో చెరకు సాగు చేయాలంటే సగటున 30వేలు ఖర్చవుతుంది. కానీ సంబంధిత భూమిలో సాగు జరిగిన చెరకు వలన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేక సన్న, చిన్నకారు రైతులు కూలీలుగా మారిపోతున్నారు. గడచిన యేడాది బెల్లం ధరలు మరింత నిరాశజనకంగా పలికాయి. దీంతో ఈ ఏడాది నత్తనడకగా చెరకునాట్లు జరుగుతున్నాయి. వర్షాదార భూములతోపాటు, మెట్ట్భూముల్లో సైతం చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. టన్ను చెరకు విత్తనం మూడునుండి నాలుగువేలు ధర పలుకుతుంది. ఎండల తీవ్రత వలన పంటలు ఎండిపోయి విత్తనం దొరకడమే గగనమవుతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా గడచిన మూడేళ్లకాలంగా చెరకు సాగు జరిగే భూముల్లో సరుగుడు వేస్తున్నారు. దీంతో సరుగుడు సాగువిస్తీర్ణం పెరుగుతోంది. పలుప్రాంతాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన చెరకు సాగు జరిగే భూముల్లో ఏ పంట వేయక బీడుభూములుగా మారే పరిస్థితి ఏర్పడింది.