విశాఖ

నేటి నుంచి వెంకన్న కల్యాణ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 24: అరకులోయలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 నుంచి 29వ తేది వరకు ఐదు రోజుల పాటు తలపెట్టిన కల్యాణ మహోత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు చేసారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు. వెంకన్న ఆలయాన్ని ముస్తాబు చేసి, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్ల వద్ద విద్యుత్ దీపాలతో దేవతా మూర్తుల కటౌట్‌లను ఏర్పాటు చేసారు. వెంకన్న ఉత్సవాలను విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేయడంతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారని భావిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా మైదాన ప్రాంతానికి చెందిన చిల్లర వ్యాపారులు రెండు రోజుల ముందే అరకులోయకు చేరుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల ఒకటో తేదిన ఆలయం ప్రాంగణంలో నారాయణ సేవ (అన్నదానం) ఏర్పాటు చేయనున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
నమ్మించి మోసం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలి
* ఎమ్మెల్యే అనిత
కోటవురట్ల, ఏప్రిల్ 24: నమ్మించి మోసం చేసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం మండలంలో బీకేపల్లి, చినబొడ్డేపల్లి, కొడవటిపూడి, లింగాపురం కోటవురట్ల మీదుగా రామచంద్రపురం వరకు మండల దేశం పార్టీ అధ్యక్షుడ లాలం కాశీనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ పత్యేక హోదా విషయంలో బీజేపీ ఆడే నాటకానికి వైసీపీ వత్తాసు పలుకుతుందన్నారు. తెలుగుదేశం పార్ట ప్రత్యేక హోదా సాధించి తీరుతుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ పోరు ఉదృతం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ మోదీని జగన్ ఎందుకు విమర్శించడం లేదని అనిత ప్రశ్నించారు. కుటిల రాజకీయాలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, దేశం పార్టీ నాయకులు వేచలపు జనార్ధన్, పినపాత్రుని బాబ్జి, పి.వి.సూర్యారావు, సుంకర బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.