విశాఖ

పాడేరులో వడగళ్ల వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 24: పాడేరు ప్రాంతంలో మంగళవారం వడగళ్ల వాన కురిసింది. వడగళ్లతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలో గత మూడు వారాలుగా నిత్యం మధ్యాహ్నాం రెండు గంటల తరువాత వర్షాలు కురుస్తున్నా మంగళవారం మాత్రం ఉదయం పదిన్నర గంటలేక వర్షం ఆరంభమై వడగళ్లు పడ్డాయి. వడగళ్ల వానతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో పలు ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా, పలు గ్రామాలలో పిడుగులు పడి పశువులు మృత్యువాతకు గురయ్యాయి. భారీ వర్షానికి పాడేరు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పాడేరులో వచ్చే నెల 6వ తేది నుంచి ప్రారంభం కానున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణ పనులు ముమ్మరంగా చేపడుతుండగా నిత్యం కురస్తున్న వర్షాలతో అంతరాయం ఏర్పడుతూ ఉత్సవ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తుంది. వర్షాలు ఇదేమాదిరిగా కొనసాగితే అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు విఘాతం ఏర్పడే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.