విశాఖ

ఎపీకీ ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అమల్లో ప్రభుతం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, ఏప్రిల్ 26 ఎపీకీ ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం మండలంలోని రెండవ రోజు ప్రారంభించిన బైక్ ర్యాలీ పాతమల్లంపేట, చీడిగుమ్మల, యల్లవరం, రావణాపల్లి , ఏటిగైరంపేట, పాకలపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి మండల దేశం పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పాకలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ ఎపీకీ ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రకటించారన్నారు. ఇప్పటికి దాదాపు నాలుగేళ్ళు కావస్తున్నప్పటికీ ఎపీపై లాలూచీ రాజకీయాలు చేసి ఎపీని అణగద్రొక్కేప్రయత్నంలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారన్నారు. ఎపీకి రావాల్సిన నిధుల విషయంలో కూడా వివక్షత చూపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో నాలుగు సంవత్సరాల పాటు సఖ్యతతో పరిపాలన సాగించారే తప్పా ఎటువంటి వివాదాలుకు తావివ్వలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక హోదా అమలు చేసే వరకు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవని ఈసందర్భంగా మంత్రి అయ్యన్న అన్నారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం ఎం. ఎం.సీ చైర్మెన్ , మండల దేశం పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, మంత్రి తనయుడు చింతకాయల విజయ్‌లు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీ లక్ష్మీనారాయణ, చోద్యం, చీడిగుమ్మల పీ ఎసీ ఎస్ అద్యక్షులు కొల్లాన కొండలరావు,బి. సత్యనారాయణ, దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.