విశాఖ

మోదమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 26: పాడేరులో వచ్చే నెల 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని అమ్మవారి ఆలయ కమిటి చైర్మన్, శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి చెప్పారు. స్థానిక మోదకొండమ్మ ఆలయంలో ఉత్సవాల పోస్టర్లను ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదమ్మ జాతరను ఈ సారి మరింత వైభవపేతంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని పాడేరు పట్టణంలో విద్యుత్ దీపాలంకరణ పనులు చాలా వరకు పూర్తి చేసినట్టు ఆమె చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన విద్యుత్ సోయగాలు ఈ సారి భక్తులకు కనువిందు చేయనున్నాయని ఆమె అన్నారు. పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని ఉత్సవాలకు రంగు రంగులతో ముస్తాబు చేస్తున్నామని, ఇతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్షించి ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలను చర్చించినట్టు ఆమె తెలిపారు. ఉత్సవాల మూడు రోజులు విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సవ కమిటి ఏర్పాటు చేసిందని ఈశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, దేశం నాయకులు వి.కాంతమ్మ, రొబ్బి రాము, చీకటి మధు, బొర్రా నాగరాజు, విజయరాణి, ఉత్సవ కమిటి ప్రధాన కార్యదర్శి బూరెడ్డి నాగేశ్వరరావు, ఈశ్వరరావు, కమిటి ప్రతినిధులు వెయ్యాకుల సత్యనారాయణ, కె.గంగన్నపడాల్, పలాసి క్రిష్ణారావు, రామక్రిష్ణ, చీకటి మధు, రొబ్బి రాము, నాగు, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబునాయుడు
కోటవురట్ల, ఏప్రిల్ 26: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని వైసీపీ రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మండల కేంద్రమైన కోటవురట్లలో వైసీపీ పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ డీవీ ఎస్ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్లబాబూరావు, అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు, పాయకరావుపేట సమన్వయకర్త వీసం రామకృష్ణ, చిక్కాల రామచంద్రరావు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడానికి ఈనెల 30న విశాఖలో నయవంచన దినం కార్యక్రమాన్ని వైకాపా నిర్వహిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 800 మంది కార్యకర్తలు తరలి వెళ్తున్నామన్నారు. వైసీపీ అదినేత జగన్ రెండువేల కిలో మీటర్ల పాదయాత్ర పూర్తవుతున్న నేపధ్యంలో వచ్చే నెల 5న నియోజకవర్గంలో సంఘీభావ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర పాయకరావుపేటలో ప్రారంభమై కోటవురట్లలో ముగుస్తుందన్నారు.