విశాఖ

పోలీసు పహారాలో పాడేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 8: రాష్ట్ర వేడుకగా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ జాతర ఉత్సవాలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎక్కడా చూసినా పోలీసు బలగాలే దర్శనమిస్తున్నాయి. పోలీసు బలగాలను ముమ్మరంగా మోహరించడంతోపాటు ప్రధాన కూడళ్లలో సి.సి.కెమెరాలను ఏర్పాటుచేసి నిఘా నీడలో అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నారు. పాడేరులో జనసంచారం అధికంగా ఉన్న 32 ప్రాంతాలను గుర్తించి సి.సి.కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నారు. సి.సి.కెమెరాలతోపాటు మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటుచేసి ఉత్సవాలకు వచ్చే భక్తులను తనిఖీ చేస్తున్నారు. మోదకొండమ్మ జాతరలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తును పటిష్టం చేశారు. ఈ సంవత్సరం అమ్మవారి జాతరను రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్సవాలకు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉండడంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మైదాన ప్రాంతం నుంచి అనేకమంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు దాదాపు వెయ్యిమంది కానిస్టేబుళ్లను ఉత్సవాలకు నియమించి రాత్రింబవళ్లు బందోబస్తు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. వీరంతా పట్టణ నలుమూలలా బందోబస్తు నిర్వహిస్తూ ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పాడేరులో అమ్మవారి జాతర సందర్భంగా మావోల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉండవచ్చునని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమై బందోబస్తును పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. ఉత్సవాలకు మంత్రులతోపాటు వి.ఐ.పి.లు హాజరుకానున్నందున మావోలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకుని వాహనాల తనిఖీని చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పాడేరులోకి వాహనాల రాకపోకలను నియంత్రించి ఎక్కడికక్కక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాల ద్వారా వచ్చే వారిని నిశితంగా తనిఖీలు చేసి వారిని విచారిస్తున్నారు. భక్తుల రద్దీ ఉండడం తో ఆలయం వద్ద బలగాలను మోహరించారు. ఆలయం ప్ర వేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటుచేసి ఆలయంలోకి వెళ్లే భక్తులను తనిఖీ చేస్తున్నారు. ఈసారి ఉత్సవాలకు పోలీసు బలగాల పహారా అధికమైంది. జాతరలో బందోబస్తును ఎఎస్పీ శశికుమార్ సమీక్షిస్తూ పోలీసు అధికారులు, సి బ్బందికి పలు సూచనలు చేస్తున్నారు.