విశాఖపట్నం

కలెక్టర్ భాస్కర్ వస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 26: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న కాటమనేని భాస్కర్ విశాఖ జిల్లా కలెక్టర్‌గా వస్తున్నారు. భాస్కర్ ఇక్కడికి వస్తారని గడచిన మూడు నెలల నుంచి చెపుతున్నా, అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. గురువారం కూడా ఆయన బదిలీపై విశాఖ వస్తున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, అధికారికంగా ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు.

నోవెల్ ఐపీఆర్ అకాడమీ ఆవిష్కరణ
విశాఖపట్నం, ఏప్రిల్ 26: వరల్డ్ ఇంటలెక్యువల్ ప్రోపర్టీ డే సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో నోవెల్ ఐపీఆర్ అకాడమీని మెడ్‌టెక్ జోన్ మేనేజింగ్ డైరక్టర్ జితేంద్రకుమార్ శర్మ ఆవిష్కరించారు. ఈ అకాడమీలో పెద్ద సంఖ్యలో ఐపీఆర్ కోర్స్‌లను అందించనున్నారు. విద్యార్థులకు, ఐపీఆర్ కెరీర్ కావాలనుకునేవారికి, పరిశోధకులకు, పారిశ్రామికవేత్తలకు ఈకోర్సులు ఉపయోగపడనున్నాయి. ఐపీఆర్ సెల్‌ను అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల్లో ఏర్పాటు చేసేవిధంగా ఆ యాజమాన్యంతో అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీఏఏపీ అధ్యక్షుడు రవి ఈశ్వరపు, బ్రాంచ్ ఎంఎస్‌ఎంఈ-డీఐ డైరక్టర్ కే.ఆర్.కే.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.