విశాఖపట్నం

వియత్నాం పోర్టుకు ఈఎన్‌సీ యుద్ధ నౌకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: ఆగ్నేయ, వాయువ్య రీజియన్‌లో ఆపరేషనల్ ప్రదర్శనకు తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ)కి చెందిన మూడు యుద్ధ నౌకలు వియత్నాంలోని టియన్‌సా పోర్టుకు వెళ్లాయి. ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి సారధ్యంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ శక్తి యుద్ధ నౌకలు ఇక్కడ జరిగే విన్యాసాల్లో పాల్గొంటాయి. భారత్, వియత్నాంకు చెందిన నౌకాదళ అధికారులు అక్కడ ప్రభుత్వంతోను, ప్రభుత్వ ప్రతినిధులతోను సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా భారత్ యుద్ధ నౌకలను అక్కడి ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. భారత్ నౌకాదళానికి చెందిన ప్రతినిధులు, బ్యాండ్ పార్టీలు అక్కడి స్థానిక అధికారులు, ప్రజలతో కలిసి మమేకపై పలు కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి పలు అంశాలు పరస్పరం సమీక్షించుకుంటాయి. ఇరు దేశాల జాతి, సంస్కృతి తదితర అంశాలతో పాటు చారిత్రాత్మక అనుబంధాలను మననం చేసుకుంటాయి. అలాగే ఇటీవల కాలంలో భారత్, వియత్నాంల మధ్య నెలకొన్న ఆర్థిక సంబంధ అంశాలను ప్రస్తావిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో వియత్నాంలో అధికార పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యహాత్మక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. వియత్నాం ప్రధాని నూజెన్ చువాన్ పుక్ గత జనవరిలో భారత్ గణతంత్ర వేడుకల్లోను, ఏషియన్-ఇండియన్ కమామరేటివ్ సమ్మిట్‌లోను పాల్గొనగా, వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌డై కువాంగ్ ఈ ఏడాది మార్చిలో భారత్ సందర్శించి ఇరు దేశాల ద్వేపాక్షిక సంబంధాలు బలోపేతమ్యే దిశగా చర్చించారు.
ఈసందర్భంగా భారత్ నౌకాదళ బృందం వియత్నాం పీపుల్స్ నేవీతో కలిసి క్షేత్ర శిక్షణ, నౌకల మరమ్మతులు, నిర్వహణ, ఎగుమతి, దిగుమతుల సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు.