విశాఖ

తపాలా ఉద్యోగుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మే 22: జీడీఎస్ ఉద్యోగుల వేతన సవరణను నియమించిన కమలేష్‌చంద్ర కమిటీ సిఫార్సులలోని సానుకూల అంశాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణంలోని ప్రధాన తపాలాశాఖ వద్ద ఎన్‌ఎఫ్‌పిఇ, ఎఫ్‌ఎన్‌పివో, ఎఐజిడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దేశం మొత్తంమీద కార్మికవర్గం హక్కులను సాధించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం అనైతిక విధానాన్ని విడనాడాలన్నారు. అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉద్యోగుల హక్కులను కాలరాయడాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని వారు దుయ్యబట్టారు. జీడీఎస్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వరాదని, సెలవులు అవసరం లేదని పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే సవరన్స్ అలవెన్సులు ఇవ్వకుంఢా తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈనెల 5వ తేదీన ఒంగోలులో జరిగిన ఏపీ రాష్ట్ర తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి సమావేశానికి డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సంఘీభావం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. నాగేశ్వరరావు, కె. మనోహర్, పి. సూర్యనారాయణ, డి. నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

ధర్మపోరాట దీక్షకు తరలివెళ్లిన తెలుగుతమ్ముళ్లు
కశింకోట, మే 22: విశాఖలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టే ధర్మపోరాట దీక్షకు కశింకోట మండలం నుండి భారీస్థాయిలో తెలుగుతమ్ముల్లు వెళ్లారు. ప్రతిగ్రామం నుండి ఒక్కబస్సు చొప్పున బయలుదేరాలని తమ్ముళ్లు ఆదేశాలు జారీచేయడంతో క్రిందస్థాయి క్యాడర్ పెన్షన్లదారులను, హౌసింగ్‌స్కీంవారిని, వికలాంగులను, జాతీయ ఉపాధిహామీ పథకంలో పనిచేసేవారిని ఎవరు కనిపిస్తే వారిని బస్సులో ఎక్కించుకుని ధర్మపోరాట దీక్షకు వెళ్లిపోయారు. ఆర్‌ఇసిఎస్ చైర్మన్ మలసాల రమణారావు, అనకాపల్లి మార్కెట్‌కమిటి చైర్మన్ కాయల మురళీధర్, ఎంపిపి పంచదార్ల లక్ష్మీ, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీనివాసరావు, దేశం నాయకులు పెంటకోటరాము,వేగి గోపికృష్ణ, మళ్లలోవకృష్ణ, పెంటకోట తాతినాయుడు, పెంటకోట సత్యనారాయణ, కొంతం ఆదినారాయణ, తాకాశి కృష్ణ , మళ్లసూర్యారావు, వేగి వెంకట్రావు, ఆడారి నరశింగరావు తదితరులు జనసమీకరణ చేసారు.