విశాఖ

పశు సంక్షేమ పథకాలను పాడి రైతులకు చేరవేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, మే 22: ప్రభుత్వం అమలు చేస్తున్న పశు సంక్షేమ పథకాలు పాడి రైతులకు చేరే విధంగా సీ ఆర్‌పీలు కృషి చేయాలని స్థానిక పశు సంవర్ధక శాఖ ఎడీ డాక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. వెలుగు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక స్ర్తి శక్తి భవనంలో సీ ఆర్‌పీలకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఎడీ మాట్లాడుతూ పాడి రైతులకు ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. క్షీర సాగరం, పశుబీమా,శైలజ గడ్డి, మిశ్రదాణా, మన కోడి తదితర పథకాలపై పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వెలుగు ఎపీ ఎం కరుణానిధి మాట్లాడుతూ ప్రభుత్వానికి, పాడి రైతులకు మధ్య సీ ఆర్‌పీలు వారధిలా పని చేయాలని సూచించారు. పశు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో తంగేడు పశువైద్యాధికారి డాక్టర్ శ్రీ్ధర్ పాల్గొన్నారు.

నాతవరం ఆరోగ్య కేంద్రంలో పాముల సంచారం
* భయాందోళనతో రోగులు పరుగులు
నాతవరం, మే 22: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పాముల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. మంగళవారం ఉదయం ఆరోగ్య కేంద్రానికి రోగులు వచ్చి చెట్టు కింద కూర్చొన్నారు. ఒక్కసారిగా అతిపెద్ద పాము బుసలు కొడుతూ రావడాన్ని గమనించిన రోగులు భయాందోళనతో పరుగులు తీసారు. అనంతరం పాము పక్కనే ఉన్న భవనంలోకి పోయింది. ఇప్పటికైనా ఆయా ప్రాంతాలను పరిశుభ్రం చేయాలని రోగులు కోరుతున్నారు.

తపాలా ఉద్యోగుల సమ్మెబాట
నాతవరం, మే 22: మండల పరిధిలో 18 తపాలా శాఖ బ్రాంచ్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఆయా కార్యాలయాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం స్థానిక తపాలా కార్యాలయంలో చేపట్టిన ఈసమ్మెకు సంబంధించిన 2016 సంవత్సరం లో పెంచిన వేతనంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిలేట్ కమిటీని నియమించిందన్నారు. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక అమలు చేయాలని కోరుతూ సమ్మె బాట పట్టామన్నారు. సమ్మె కారణంగా కొన్ని చోట్ల బ్రాంచ్ కార్యాలయాల ద్వారా ఉపాధి హామీ, ఎన్టీ ఆర్ గృహాల బిల్లులు అందక లబ్దిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అకస్మాత్తుగా ఆర్‌ఇసిఎస్‌లో పరిపాలన పరమైన బదిలీలు
చైర్మన్ మార్క్
కశింకోట, మే 22: ఐదు మండలాల పరిధిలో ఉన్న అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఇసిఎస్)లో పరిపాలన పరమైన బదిలీలు అకస్మాత్తుగా మంగళవారం చేపట్టారు. ఉత్తర్వులను తయారుచేసే వారికి కూడా తెలియకుండా మేనేజ్‌మెంట్ రహస్యంగా తయారుచేసి జారీచేయడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగస్తుల వంతైంది. వివరాల్లోకి వెళితే గత కొన్ని ఏళ్లుగా ఎటువంటి బదిలీలు, మార్పులు, చేర్పులు చేయని ఆర్‌ఇసిఎస్ అధికార యంత్రాంగం ఒక్కసారిగా అకస్మాత్తుగా కొంత మంది ఉద్యోగుల స్థానాలను మార్పు చేసారు. గత ఆరు మాసాల క్రితం ఉద్యోగస్తుల బదిలీలు చేపట్టేందుకు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డి శ్రీనివాసరాజు, ప్రాజెక్టు ఇంజినీర్ జె ప్రసాదరావు సన్నహాలు చేసారు. అయితే ఈ విషయం తెసుకున్న ఉద్యోగస్తులు ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ ప్రజాప్రతినిధులచే పైరవీలు చేయించడంతో ఏమిచేయాలో తెలియని ఎం.డి,పి.ఇలు సమయం వచ్చేవరకు వేచిచూసారు. చైర్మన్ మలసాల రమణారావు ఆదేశాలు మేరకు గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది ఉద్యోగస్తుల స్థానాలను మార్పుచేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. ఉత్తర్వులు జారీచేసే సమయంలో మేనేజింగ్ డైరక్టర్‌గాని, ప్రాజెక్టు ఇంజినీర్‌గాని, సంస్థ చైర్మన్‌గాని సంస్థ ప్రధాన కార్యాలయంలో లేకపోవడం విశేషం. ఈ ఉత్తర్వులను ఎ.ఓ జానకీరావుబదిలీ అయిన ఉద్యోగస్తులను సంస్థ ప్రధాన కార్యాలయంలో అందజేసారు. కొంతమందిని మాత్రమే బదిలీ చేసారు. దీంతో ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లైంది. ఏదిఏమైనా చైర్మన్ మలసాల రమణారావు ఉద్యోగుల బదిలీల్లో తన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు.