విశాఖపట్నం

జనసేనానికి రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసుల తీరును ఆపార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి టీ శివశంకర్ ఆరోపించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. పవన్ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు సంఘీభావం తెలుపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు భద్రత కల్పించాల్సిన పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ అధినేతగా ఓట్ల కోసం కాకుండా ప్రజల కష్టాలను, ఈ ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకే పవన్ యాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోరుతూ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం రూపుమాపేందుకు అనుసరించాల్సిన స్పష్టమైన వైఖరితో పవన్ యాత్ర చేస్తున్నారన్నారు. అయితే ఆయన సభలకు వేలాదిగా వస్తున్న జన సందోహంలో విద్రోహ శక్తులు చొరబడి అఘాయిత్యాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులు తలెత్తితే అందుకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.