విశాఖ

తపాలా ఉద్యోగులు నిరవదిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మే 22: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవదిక సమ్మె చేపట్టారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తపాలా ఉద్యోగులు సమ్మెకు పూనుకుని తపాలా కార్యాలయాల ఎదుట ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేసారు. అరకులోయ, అరకు ఆర్.ఎస్. తపాలా కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న 74 మంది ఉద్యోగులు నిరవదిక సమ్మెకు దిగడంతో తపాలా కార్యకలాపాలు స్థంబించాయి. కమలేష్ చంద్ర ఏడో పే కమిషన్ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో గ్రామీణ తపాలా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నట్టు తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.ఎస్.కుమార్ వాపోయారు. వేతన సవరణ బిల్లు చట్టాన్ని అమలు చేయాలని 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటి అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని ఆయన అన్నారు. తమ సమస్యలపై గతంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధికారులు ఏడో వేతన సవరణ బిల్లు చట్టాన్ని అమలు చేయకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగినట్టు ఆయన చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు నిరవదిక సమ్మె కొనసాగుతుందని కుమార్ స్పష్టం చేసారు.