విశాఖపట్నం

జగన్ పర్యటన నగరంలో లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర జూన్ నెలాఖరు, లేదా జూలైలో విశాఖకు చేరుకోనుంది. అయితే, జగన్ పాదయాత్ర విశాఖ నగరంలో లేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన నగరంలోని ఆరు నియోజకవర్గాలను వదిలి, గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయన విశాఖ నగరంలో పర్యటించే అవకాశాలు లేనందువలనే, కొద్ది రోజుల కిందట పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నగర పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. జగన్ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి రాష్ట్రంలో 50 నియోజకవర్గాలు ఇంకా మిగిలిపోతాయి. జగన్ తన పాదయాత్రను ఇచ్చాపురంతో ముగించనున్నారు. ఆ తరువాత కొంత కాలం పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించనున్నారని తెలిసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్ మళ్లీ బస్సు యాత్ర నిర్వహిస్తారని, అప్పుడు ఈ 50 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలియచేశాయి.