విశాఖపట్నం

మార్చి నాటికి పనులు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలో పంచాయతీరాజ్ ద్వారా చేపడుతున్న సిసి రోడ్లు, అభివృద్ధి పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. రోజుకు మూడు కిలోమీటర్ల రోడ్లను వేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సోమవారం ఆయన జెడ్పీలోని సిఇఒ చాంబరులో ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంజిఎస్‌వై, నాబార్డు ద్వారా చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 17 పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ సచివాలయ భవనాలు, సిసి రోడ్లు, డ్రైయిన్లు తదితర పనులను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద 84503 పనులు మంజూరు కాగా, 46163 పనులు పూర్తి చేశామని మంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సివిఎస్ రామమూర్తి, కె.రవిబాబు, చీఫ్ ఇంజనీర్ ఆర్ వెంకటేశ్వరరావు, పద్మజ, జగదీశ్వరరావు, కె.కె.కిశోర్‌కుమార్, పంచాయతీరాజ్ ఇఇ ప్రభాకరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై న్యాయ విచారణ జరపాలి
* నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలి
* ప్రభుత్వానికి ప్రజా సంఘాల డిమాండ్
విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటనపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పేదల రక్తాన్ని పిండేస్తోన్న వీరిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా ఈ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రదేశం హోరెత్తింది. విశాఖ జిల్లాలో కాల్‌మనీ నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కాల్‌మనీ వ్యాపారులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రంలో కాల్‌మనీ వ్యాపారులు ప్రజల బతుకులను నాశనం చేస్తున్నారని విమర్శించారు. వారి అవసరాలను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు అధిక మొత్తాల్లో వసూలు చేస్తూ అక్రమంగా ఆస్తులను గుంజుతున్నారన్నారు. అలాగే మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మరికొందరు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇటువంటి వారందర్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రాంసరీనోట్లు, రుణపత్రాలు ఆస్తీ పత్రాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సూచించారు. వ్యాపారులు వసూలు చేసే అధిక మొత్తాలను తిరిగి బాధితులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు తగిన రక్షణ కల్పిస్తూ కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటనను పూర్తిస్థాయిలో విచారించి, నేరస్తులను గుర్తించేందుకు వీలుగా న్యాయమూర్తుల బృందంతో కూడిన న్యాయవిచారణ ఆదేశించారు. కాల్‌మనీ, లైంగిక వేధింపులపై పిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. కాల్‌మనీ ఘటనలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలన్నారు. రాజకీయపార్టీల్లో ఉన్న కాల్‌మనీ వ్యాపారులను బహిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు ఎస్.జ్యోతిశ్వరరావు, ఆర్‌ఎన్ మాధవి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి వి.కృష్ణారావు, కుల నిర్మూలన సంఘ నగర కార్యదర్శి ఆర్‌పి రాజులు పాల్గన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ప్రతినిది బృందం సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసింది.