విశాఖ

రెండు కోట్లతో సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఆధునీకరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు,మే 25: సీలేరు జల విద్యుత్ కేంద్రంలో రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరణ ఫనులు జరుగుతున్నాయని డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ , కంటెన్షర్ ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పీ ఎఫ్ బీ ఎస్ విద్యుత్‌తో రెండు కోట్లతో ట్రాన్స్‌ఫార్మర్ ఆధునీకరణ పనులు ప్రారంభించామన్నారు. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లకే కీలకమన్నారు. ఇవి చాలా పాతవి కావడంతో గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి స్థానంలో కొత్తవి అమర్చాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈపనులు చేపట్టామన్నారు. సిస్టమ్ డెలప్‌మెంట్‌లో పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ నిధుల్లో 90 శాతం నిధులను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ భరిస్తుందని, మిగిలిన 10 శాతం నిధులు ఎపీ జెన్‌కో ఇస్తుందని డీ ఇ తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 1,2 యూనిట్లుకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు సీవీటీలు కొత్తవి ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసామన్నారు. మరో 10 రోజుల్లో 3,4 యూనిట్లుకు సంబంధించి సీటీ, సీవీటీలను కొత్తవి అమర్చే పనులు పూర్తి కానున్నాయన్నారు. నాల్గవ యూనిట్ టెస్ట్ బేరింగ్ కూలర్ మరమ్మతు పనులు కూడా పూర్తయ్యాయని జల విద్యుత్ కేంద్రానికి నీటి కొరత కారణంగా యూనిట్లులో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. బలిమెల జలాశయంలో మన వాటా నీరు ఏమీ లేదన్నారు. ఎండలు అధికంగా ఉండడంతో గుంటవాడ రిజర్వాయర్‌లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవన్నారు. గుంట వాడ డ్యామ్, పిల్లివాడ నుంచి పెద్దగా ఇన్‌ఫ్లో రావడం లేదని ,జూన్‌లో ఏమైనా వర్షాలు కురిస్తే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఫ్రస్తుతం ఉన్న నీటిలో జల విద్యుత్ కేంద్రంలో 0.21 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసామన్నారు.

సమస్యల పరిష్కారమే మన గ్రామం- మన విశాఖ ధ్యేయం
గొలుగొండ, మే 25: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమే మన గ్రామం- మనవిశాఖ ప్రధాన ధ్యేయమని ఎంపీడీ ఓ సువర్ణరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పాతమల్లంపేట గ్రామంలో మనం గ్రామం - మన విశాఖ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో పర్యటించి వీధి రోడ్లు, అంగన్‌వాడీ, పారిశుధ్యం, తాగునీరు సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్బంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీ ఓ సువర్ణరాజు మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన అన్నారు. గ్రామాల్లో రేషన్ కార్డులు, ఫించన్లు తదితర వాటిపై ఏమైనా సమస్యలున్నాయా అని ప్రశ్నించారు. దీనికి గ్రామస్తులు అర్హులైన వ్యక్తులకు ఫించన్లు, రేషన్ కార్డులు, అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీడీ ఓ దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పటికే గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, వీటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జీవీ ఎస్ నాగేంద్ర, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సత్యవతితో పాటు మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.