విశాఖ

ఉపాధి పనులకు 15 కోట్లతో ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, మే 25: ఉపాధి హామీ పథకం కింద మండలంలో 2018-19 సంవత్సరానికి 15 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించగా మొదటి విడతగా 2.33 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఉపాధి హామీ పథకం ఎపీ ఓ నాగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన ఉపాధి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది 6.33 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రస్తుతం మండలంలో నీటి నిల్వ కందకాలు పనులు మంజూరు, గొట్టివాడ, రామచంద్రపురం గ్రామాల్లో జరుగుతున్నాయన్నారు. ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయం మేరకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మైనార్టీ ఇరిగేషన్ పధకంలో పాములవాక పంచాయతీ పరిధిలో ఐదు చెరువులు, కైలాసపట్నంలో ఒక చెరువులో పూడిక తీత పనులు జరుగుతున్నాయన్నారు. ఒక్కొక్క చెరువుకు ఐదు లక్షల రూపాయలు వంతున ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మండలంలో 9,200 మంది కూలీలు పనులు చేస్తున్నారన్నారు. యండపల్లి,చౌడువాడ, గ్రామాల్లో పోస్ట్ఫాసుల ద్వారా పంపిణీ చేస్తున్న వేతనాలు సరిగా అందడం లేదని కూలీలు ఫిర్యాదు చేసారన్నారు. ఈసమస్య పరిష్కారంపై దృష్టిసారించామన్నారు.

వదంతులను నమ్మవద్దు
కోటవుటర్ల,మే 25: కిడ్నాప్ ముఠాలు, దొంగలు సంచరిస్తున్నారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్సై తారకేశ్వరరావు సూచించారు. మండలంలో కె.వెంకటాపురంలో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థపై సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి దొంగలు, ముఠాలు సంచరించడం లేదన్నారు. కొత్త వ్యక్తులు, అపరిచితులు కనిపిస్తే దాడి చేయవద్దని, సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలకు పోలీసులు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిలో భాగంగా గ్రామంలో 25 మంది యువకులు పోలీసులకు సహకరించడానికి ముందుకు వచ్చారన్నారు. వారి సేవలను తాము వినియోగించుకుంటామని తెలిపారు.