విశాఖపట్నం

విశాఖకు ఎంతో చేశాం ... ఇంకా చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు అధికారం చేపట్టిన నాలుగేళ్ల కాలంలో విశాఖకు ఎంతో చేశామని, ఇంకా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలతో పాటు మరిన్ని సంస్థలు విశాఖలో ఏర్పాటు చేశామన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను 2015లో ప్రారంభించగా, ఏయూలో తాత్కాలిక వసతిలో తరగతులు ప్రారంభించామని, ఇప్పటికే రెండు బృందాలు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 2016లో శంకుస్థాపన చేయగా, అదే సంవత్సరం నుంచి తాత్కాలిక వసతిలో తరగతులు జరుగుతున్నాయన్నారు. ఆరిలోవలో పెట్రోలియం సంస్థల ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నెలకొల్పామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఉపయుక్తంగా సీజీహెచ్‌ఎస్ వెల్నెస్ సెంటర్ విశాఖలో ఏర్పాటు చేశామన్నారు. అలాగే వైద్య పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా విదేశాల నుంచి పరికరాలు దిగుమతి చేసుకునే పరిస్థితులు ఇకపై ఉండవన్నారు. రూ.500 కోట్ల వ్యయంతో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా గుర్తించడం ద్వారా మెరుగైన సేవలందించేదుకు వీలవుతుందన్నారు. కేంద్రం రూ.80 కోట్ల వ్యయంతో సమీర్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ప్రత్యక్ష ఉపాధితో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాన్నారు. నగరంలో ఎగుమతి తనిఖీ మండలి పరీక్ష ప్రయోగశాల ఏర్పాటు ద్వారా సముద్ర ఉత్పత్తుల పరీక్షలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండదన్నారు.
విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీని రూ.20,928 కోట్లతో విస్తరిస్తున్నామని, అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో అచ్యుతాపురం, భీమిలి, నక్కపల్లిలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిని రూ.2,300 కోట్లతో ఏర్పాటు చేయడమే కాకుండా, షీలానగర్-సబ్బవరం రహదారిని జాతీయ రహదారికి అనుసంధానించే పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ విమానాశ్రయాభివృద్ధికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో టెర్మినల్స్ ఏర్పాటు, వంటి అభివృద్ధి చర్యలు నగర ప్రగతికి దోహదం చేస్తాయన్నారు. తన ఎంపీ ల్యాడ్ నిధులతో పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పన, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, బయో టాయిలెట్స్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు జే పృధ్వీరాజ్, ఎస్‌వీఎస్ ప్రకాశరెడ్డి, నరేంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.