విశాఖపట్నం

గీతం ఎమ్మెస్సీ కోర్సుల అడ్మిషన్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ కోర్సులకు 2018 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కౌనె్సలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెస్సీలో అప్లైడ్ మేథ్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, డేటా సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరుగుతోందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే అరుణ లక్ష్మి తెలిపారు. మూడేళ్ల కాల వ్యవధి గల ఎంసీఏ కోర్సులకు జాతీయ స్థాయిలో గీతం సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (జీశాట్-2018) ప్రవేశ పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు సుమారు 1000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు లభించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులకు గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, ప్రోవైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే రాజగోపాల్, కే సురేష్‌కుమార్, ఎన్ శ్రీనివాస్ తదితరులు ప్రవేశ ధృవీకరణ పత్రాలు అందజేశారు.