విశాఖపట్నం

ఎవరో వస్తారని ఎదురు చూడద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: ఎవరో వస్తారని ఎదురు చూడకుండా, మంచి అనుకున్న పని చేసేయాలని సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. టీపీటీ కాలనీలోని వసంత బాల విద్యోదయ పాఠశాలలో పూర్వ విద్యార్థులు నిర్మించిన నూతన భవనాన్ని లక్ష్మీనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అనేక ప్రాథమిక పాఠశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయని న్నారు. 30,40 సంత్సరాల కిందట ప్రాథమిక విద్యను చదివినవారు ఇప్పుడు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, వారు ఆయా స్కూళ్లకు వెళ్లి వాటికి మరమ్మతులు చేపడితే, చాలా స్కూల్స్ బాగుపడతాయని అన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వమే బాగుచేస్తుందన్న భావనను విడనాడి స్వచ్ఛందంగా ముందుకు కదలాలని ఆయన సూచించారు. ఈ తరంలో మనం విద్యాలయాలపై మక్కువ చూపితే, భవిష్యత్ తరాలు కూడా ఇదే ఒరవడిలో నడుస్తారని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో నూతన భవన నిర్మాణానికి సహకరించిన దరణికోట కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో థియోసోఫికల్ సొసైటీ కార్యదర్శి ప్రదీప్ గోహిల్, సీఎంఆర్ అథినేత మావూరి వెంకటరమణ, డీఈఓ లింగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.