విశాఖపట్నం

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వినతులు ఇచ్చేందుకు ఆర్జీదార్లు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వారితో కలెక్టరేట్ కిక్కిరిసింది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సంయుక్త కలెక్టర్ సృజన, జేసీ 2 డాక్టర్ సి, డీఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇళ్ల కాలనీలు, పింఛన్లు, రేషన్ కార్డులు కోరుతూ పలువురు దరఖాస్తు చేసుకోగా, భూ సంబంధ వివాదాలపై పలు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ప్రజావాణికి 225 వినతులు అందాయి.
డయల్ యువర్ కలెక్టర్‌కు 16కాల్స్
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగానికి 16 ఫోన్ కాల్స్ వచ్చాయి. జేసీ సృజన పోన్‌లో ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రావికమతం మండలం ద దొండపూడికి చెందిన వికలాంగుడు తనకు 2015 తరువాత పింఛన్ అందలేదని, పింఛన్ పునరుద్ధరించాలని కోరాడు. చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రణావాణాపై ఫిర్యాదు చేశాడు. ఇదే మండలం భోగాపురం గ్రామంలో మరో మహిళ తనకు వితంతు పింఛన్ ఇప్పించాల్సిందిగా కోరాడు. పాడేరు సహాయ డిఎంహెచ్‌ఓ కార్యాలయానికి తాను అద్దె విధానంలో వాహనాన్ని నడిపానని, ఆరు నెలల వాడుకుని బిల్లు చెల్లించలేదంటూ ఫిర్యాదు చేశాడు. మునగపాక మండలం సిరసపల్లి నుంచి మరో వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ తహశీల్దార్ల సంతకాలు లేకుండా గృహనిర్మాణానికి ఎల్‌పీసీలు మంజూరు చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఫోన్ ద్వారా అందిన ఫిర్యాదులపై జేసీ స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చెరువు మట్టిని దోచేస్తున్నారు
భీమునిపట్నం మండలం సింగనబంద గ్రామం మామిడిబంద చెరువులో మట్టిని స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా తరలించుకుపోతున్నారని, ఇదేమిటని అడిగినందుకు సర్పంచ్ మద్దిల వెంకటరమణపై దౌర్జన్యానికి తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ప్రైవేటు లేఅవుట్‌లో పనుల నిమిత్తం గ్రామంలో చెరువును 20 అడుగులకు పైగా లోతు తవ్వేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించినందుకు దౌర్జన్యానికి దిగారన్నారు. మంత్రి గంటా అనుచరులుగా పేర్కొంటున్న కొంతమంది సర్పంచ్‌పై దౌర్జన్యానికి దిగడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ అమలు చేయాలి
మామిడిబంద చెరువులో మట్టి తవ్వకాల పనులు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాకుండా, నీరు-చెట్టు పథకంలో చేపట్టారని సింగనబంద గ్రామానికి చెందిన మహిళా ఉపాధి కూలీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఈ పనులు చేపట్టడం ద్వారా తమకు ఉపాధి పనులు దక్కలేదని, యంత్రాలతోనే పనులు చేస్తున్నారని కూలీలు ఆరోపించారు. టీడీపీ నాయకుల తీరుపై విచారణ జరిపి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.