విశాఖ

వంద కోట్లతో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుకుంపేట, జూన్ 19: హుకుంపేట మండలంలో దాదాపు వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు చెప్పారు. మండలంలోని తీగలవలస పంచాయతీ సంతలిచింత నుంచి ఓలుబెడ్డ గ్రామం వరకు రెండు కోట్ల 95 లక్షల రూపాయలతో నిర్మించనున్న తారురోడ్డుకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకులోయ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మన్యంలో మరెక్కడా జరగలేదని అన్నారు. హుకుంపేట మండలంలో ప్రతి పంచాయతీలో కోట్ల రూపాయలను వెచ్చించి వివిధ పథకాలు చేపట్టామని, రహదారులను నిర్మించామని ఆయన చెప్పారు. తీగలవలస పంచాయతీలోని 24 గ్రామాలలో మూడు కోట్ల రూపాయలతో సి.సి.రోడ్లు, ఎనిమిది కోట్లతో మెటల్ రోడ్లు, కుంతర్ల నుంచి బొడ్డాపుట్టు వరకు నాలుగు కోట్లతో తారు రోడ్డు, ఎనిమిది చెక్‌డ్యాంలు నిర్మించామని ఆయన వివరించారు. గతంలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు అదనంగా 25 వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు ఆయన చెప్పారు. పోడు భూములకు భూమి పట్టాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను గిరిజనులు విశ్వసించరాదని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో దేశం పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యవౌతుందని సర్వేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వసంతకుమారి, సర్పంచ్ కామేష్, దేశం నాయకులు బాకూరు వెంకటరమణ, శెట్టి లక్ష్మణుడు, తులసిరావు, సూర్యకాంతం, కంబిడి రాంబాబు, గాసన్న, సుబ్బారావు, శంకర్, శెట్టి మహేష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రత్యేక రెవెన్యూ సదస్సు
కోటవురట్ల, జూన్ 19: భూ సమస్యల పరిష్కారం కోసం మండలంలో ఈనెల 20 నుంచి ప్రత్యేక రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ ఎం. ఎ.శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ సదస్సులు కోసం రెవెన్యూ అధికారులతో రెండు గ్రూప్‌లను ఏర్పాటు చేసామన్నారు. ఈనెల 20న పాములవాక , తంగేడు, 21న బోడపాలెం, రాజుపేట, 23న చినబొడ్డేపల్లి, కైలాసపట్నం, 25న కొడవటిపూడి,లింగాపురం, 26న టి.జగ్గంపేట, జల్లూరు, 27న గొట్టివాడ కొత్తూరు, 28న చౌడువాడ, అన్నవరం గ్రామాల్లో రామాలయాల వద్ద గ్రామసభలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. అలాగే 29న పండూరు, యండపల్లి, వచ్చే నెల 2న పీకేపల్లి, కోటవురట్ల, 3న బీకేపల్లి, రామన్నపాలెంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీమ్ వన్‌కు తాను, టీమ్ 2కు డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యం వహిస్తారన్నారు. ఈగ్రామసభలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసారు.