విశాఖ

నిప్పుల కొలిమిగా అరకులోయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 19: అరకులోయ నిప్పుల కొలిమిగా మారింది. అనునిత్యం చల్లదనంతో నిండి ఉంటే ఈ ప్రాంతంలో భానుడు భగ భగ మండుతుండడంతో ప్రజానీకం బేంబెలెత్తుతుంది. తాజా వాతావరణ పరిస్థితులతో స్థానికులతో పాటు సందర్శకులు సైతం విలవిలలాడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఇళ్లలో ఉండలేక వీధుల్లో తిరగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి సీజన్ ముగిసి నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమి నుంచి సెగలు పుట్టుకువస్తున్నాయి. వాస్తవానికి వేసవి సీజన్ అనంతరం ప్రవేశించే మృగశిర కార్తిలో వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈ సంవత్సరం భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వేసవి తాపానికి చిన్నారులు వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి పాట్లు రెట్టింపయినట్టు చెప్పవచ్చు. సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వాతావరణం చల్లబడకపోవడంతో జనం ఇళ్లకే పరిమితవౌతున్నారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

విభజన హామీలు అమలు చేయాలని రాస్తారోకో
అరకులోయ, జూన్ 19: రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు డిమాండ్ చేసారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రకటనకు నిరసనగా అరకులోయ పట్టణంలో సి.పి.ఎం. మంగళవారం రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన చట్టం హామీలో రైల్వే జోన్ ఉన్నప్పటికీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రకటన చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా మంత్రి ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం., గిరిజన సంఘం నాయకులు టి.హరి, మగ్గన్న, సద్దు, భగత్, చందు తదితరులు పాల్గొన్నారు.