విశాఖపట్నం

క్రీడల్లో రాణించే విద్యార్థులను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రీడల్లో రాణించే విద్యార్థులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రాజెక్టు గాండీవపై అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యంగా ఐదేళ్ల లాంగ్‌టెర్మ్ అథ్లెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజన, సాంఘిక సంక్షేమ, మున్సిపల్, ప్రైవేటు పాఠశాలన్నింటి నుంచిక్రీడల్లో రాణిస్తున్న వారిని గుర్తించి ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫిజికల్ లిటరసీ టీచర్లకు గుంటూరు నాగార్జున యూనివర్శిటీ, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నందు జమైకా, సౌత్ ఆఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అంతర్జాతీయ శిక్షకులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. వీరు జిల్లా స్థాయిలో ప్రావీణ్యం కనబరిస్తే, వారికి గాండీవ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సృజన, జేసీ 2 డాక్టర్ సిరి, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, డీఎస్‌డీఓ జూన్ గాలియట్, స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు

గంజాయి కేసుల్లో రిమాండ్ ఖైదీలకు అవగాహన
ఆరిలోవ, జూన్ 19: కారాగారాని వచ్చిన రిమాండ్ ఖైదీలకు వారు పాల్పడిన నేరాలను అనుసరించి బెయిల్ వచ్చే పరిస్థితులు ఆధారపడి ఉంటాయని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ దామోదర్ అన్నారు. జిల్లా కేంద్ర కారాగారాన్ని మంగళవారం సందర్శించిన ఆయన రిమాండ్ ఖైదీలతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి కేసుల్లో రిమాండ్ ఖైదీలకు బెయిల్ రాకపోవడంపై కారణాలు వివరించారు. గంజాయి నిషేధిత మత్తు పదార్ధమని, యువతకు సమాజానికి చేటు చేస్తుందని, ఈ కారణంగానే ముద్దాయిలకు బెయిల్ మంజూరు కాదన్నారు. గంజాయి కేసులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు పై కోర్టుల్లో పరిశీలిండం జరుగుతుందన్నారు. కింది కోర్టులకు బెయిల్ మంజూరు చేసే అధికారం లేదన్నారు. జైలు అధికారులు బెయిల్ కోసం సిఫారసు చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.