విశాఖపట్నం

ఆటోలకు డిజిటల్ మీటర్ల ప్రతిపాదనలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 28: పాత ఆటోలకు డిజిటల్ మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ రెహ్మాన్ మాట్లాడుతూ ఆటోలకు కుడివై రాడ్లు అమర్చాలన్న విదానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వేలాదిమంది ఆటో కార్మికులు ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా ఆటోలు కొనుగోలు చేసుకుని వాటిని నడుపుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఏడాది వేలాది రూపాయలు చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆటోలు నడపడం వలన వస్తున్న స్వల్ప ఆదాయంతో బతుతు జీవనం సాగిస్తున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్డీఏ అధికారుల వేధింపులు, కేసులు నిలిపివేయాలని, జాతీయ బ్యాంకుల ద్వారా ఆటో కొనుగోలు రుణాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ఎం.ఆనందరావు, అధ్యక్షులు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.చిట్టిబాబు, కె.సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

కాఫీ గింజల సేకరణ వేగవంతం
అరకులోయ, డిసెంబర్ 28: అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో కాఫీ గింజల సేకరణ ప్రకృయను వేగవంతం చేసినట్టు స్థానిక గిరిజన ప్రాధమిక సహకార మార్కెటింగ్ సొసైటీ (జి.పి.సి.ఎం.ఎస్.) సీనియర్ మేనేజర్ పోతల సింహాద్రప్పడు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాశ్ ఆదేశాల మేరకు నాణ్యమైన కాఫీ గింజల సేకరణ జోరు పెంచామన్నారు. తమ సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా కాఫీ గింజలను సేకరిస్తుండడమే కాకుండా కాఫీ పండించిన గిరిజన రైతుల గ్రామాల్లోకి తామే నేరుగా వెళ్లి కాఫీ గింజలు సేకరిస్తున్నామన్నారు. నాణ్యతగా ఉన్న కాఫీ గింజలను మాత్రమే రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాఫీ సాగు చేసిన గిరిజన రైతులు తీసుకువస్తున్న కాఫీ గింజల్లో తేమ శాతం అధికంగా ఉందని, ఈ మేరకు అమ్మకానికి తీసుకువచ్చే ముందు కాఫీ గింజలను ఆరబెట్టి తేమను పరిశీలించి తీసుకురావాలని సూచిస్తున్నామన్నారు. గిరిజన సహకార సంస్థకు విక్రయించే కాఫీ పదును లేకుండా పూర్తిగా ఎండిన వరకు ఆరబెట్టిన అనంతరం విక్రయించాలని గిరిజన కాఫీ రైతులను కోరుతున్నామన్నారు. ఇప్పటి వరకు అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిధిలోని కాఫీ రైతుల నుంచి రెండు వేల కిలోల కాఫీ గింజలను సేకరించినట్టు ఆయన తెలిపారు. లక్ష్యానికి మించి కాఫీ గింజలు సేకరించాలన్న ఉద్ధేశ్యంతో ప్రతి రోజు కాఫీ రైతుల వద్దకు వెళ్లి నాణ్యమైన కాఫీ సేకరణ చేపట్టామన్నారు. ఈమేరకు కాఫీ రైతులు ప్రతి ఒక్కరూ నేరుగా గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే కాఫీ విక్రయించాలని, దళారులు, వ్యాపారులను ఆయ్రించి మోసపోద్దని కోరారు. గిరిజన సహకార సంస్థకు కాఫీ గింజలను విక్రయించే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల్లో వెనువెంటనే నగదు జమచేస్తునట్టు పోతల సింహాద్రప్పడు తెలిపారు.