విశాఖపట్నం

వివాదంలో రో హౌసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: రుషికొండ వద్ద వుడా నిర్మించిన రో హౌసింగ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఏడు, ఎనిమిది సంవత్సరాల కిందట నానా తంటాలు పడి రుషికొండ ఐటీ సెజ్‌ను ఆనుకుని రో హౌసింగ్ పేరుతో ఎనిమిది విల్లాలను వుడా నిర్మించింది. అప్పటి నుంచి వీటిని విక్రయించడం వుడాకు తలకు మించిన భారంగానే ఉండేది. రో హౌసింగ్‌లో తొలివిడత నిర్మించిన విల్లాలను వేలం వేయగా ఒక్కో విల్లా 82 లక్షలకు వెళ్లింది. ఆ తరువాత మిగిలిన విల్లాలను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు వుడా పడరాని పాట్లు పడింది. విల్లాలనైతే నిర్మించారు కానీ, వౌలిక సదుపాయాలు కల్పించడంలో వుడా పూర్తిగా విఫలమైంది. ఇప్పుడిప్పుడు కాస్త వౌలిక సదుపాయాలను అక్కడ కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ రో హౌసింగ్‌లో మిగిలిన ఇళ్లు అమ్ముడవడం లేదు. దీంతో ఇందులో 11 విల్లాను ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిహాబిలిటేషన్ టూరిజం కింద ఆయుష్ విభాగానికి అప్పగించింది. పోస్ట్ ట్రీట్‌మెంట్ థెరపీ కింద రోగులను ఈ విల్లాల్లో ఉంచనున్నారు. అలాగే రోగులకు రిహాబిలిటేషన్ సెంటర్‌గా ఈ విల్లాలను మార్చబోతున్నారు. నివాసిత ప్రాంతాల మధ్య ఇటువంటి రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడాన్ని రో హౌస్ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విల్లాలు రోగులతో నిండిపోతే, నివాస ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రో హౌస్‌లను విక్రయించినప్పుడు దీన్ని గృహ సముదాయంగానే ఉంచుతామని వుడా పేర్కొంది. అయితే, ఈ హామీకి భిన్నంగా వుడా ఇప్పుడు ఇలా వేరే సంస్థలకు ఇవ్వడం పట్ల యజమానులు నిరసన తెలియచేస్తూ రో హౌసింగ్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. వీరంతా కలిసి కలెక్టర్, వుడా వీసీని కలిసి తమ సమస్యలను వివరించారు. వుడా వీసీ బసంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ, యజమానుల అభ్యర్థనను పరిశీలిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరానికి వచ్చినప్పుడల్లా, వుడాకు చెందిన ఏదో ఒక కార్యక్రమం ఉండాలన్న ఉద్దేశమో ఏమో కానీ, లక్షలు వెచ్చించి, వుడా నిర్మించిన ఈ రో హౌసింగ్‌లో విల్లాలను కొనుక్కుని, ప్రశాంతంగా జీవనాన్ని సాగించాలనుకనే వారి మధ్య ఇలాంటి రోగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసం. ఏకంగా 11 విల్లాలను ఇందుకోసం కేటాయించడం విడ్డూరంగా ఉంది. హెల్త్ టూరిజంను ప్రోత్సహించాలంటే, వేరే స్థలమే వుడాకు దొరకలేదా? ముఖ్యమంత్రి మెప్పుకోసం వుడా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, వుడా నిర్మించిన హరిత భవనాలు అస్తవ్యస్థంగా ఉన్నా, అందులోని యజమానులు ఇబ్బందిపడుతున్నారు. కొత్తగా రో హౌసింగ్ యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడం వలన వుడా సాధించేదేంటి?