విశాఖపట్నం

నేనున్నాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21: అలకపాన్పు ఎక్కిన మంత్రి గంటాను చంద్రబాబు నాయుడు శతవిధాలా బుజ్జగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం ఉదయం ఫోన్‌లో, ఆ తరువాత విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు బస్సులో గంటాను పిలిపించుకుని బుజ్జగించినట్టు తెలిసింది. వీరి మధ్య సంభాషణ జరిగిన తీరు ఇలా ఉంది. ఒక పత్రికలో వచ్చన సర్వే గురించి గంటా చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, మొదటి రోజు సర్వేను చూశాను. అప్పుడే, తను జోక్యం చేసుకుని ఉంటే, బాగుండేదని చంద్రబాబు గంటాకు చెప్పినట్టు తెలిసింది. ఈ సర్వే వలన ఇంత మనస్తాపం చెందుతావని తాను భావించలేదని చంద్రబాబు గంటాతో అనట్టు సమాచారం. ‘నిన్ను నా సొంత మనిషిగా భావిస్తున్నాను. నీ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది. కానీ పార్టీలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది.’ అని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గంటా మాట్లాడుతూ గతంలో ‘నేను తెలుగుదేశం పార్టీని విడిచి పీఆర్పీలోకి వెళ్లినప్పుడు కూడా తను మిమ్మల్ని విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా నా రాజకీయ గురువు మీరేనని చెప్పాను. తిరిగి తెలుగుదేశం పార్టీలో విశాఖలో మీ సమక్షంలో చేరినప్పుడు తనపై విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు అధికారంలోకి రావాలన్నది నా ఉద్దేశం’ అని గంటా చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. ఈ సమయంలో బాబు మాట్లాడుతూ ‘నీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా నాతో వచ్చి చెప్పు. మళ్లీ యథావిధిగా పనిచేసుకో.’ అని గంటాకు చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.

అంగన్‌వాడీల జీతాల పెంపు ఆనందదాయకం : శోభా హైమావతి
జగదాంబ, జూన్ 21: అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని తెలుగునాడు అంగన్‌వాడీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శోభాహైమవతి అన్నారు. నగరంలో టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లక్ష పదివేల అంగన్‌వాడీ కుటుంబాలకు మంచి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కింద స్థాయిలో పని చేస్తున్న వర్కర్లు శ్రేయస్సు కొరి వారిని పిలిపించి సమస్యల పరిష్కార వేదికగా నిర్ణయాలు తీసుకొవడం హర్షనీయమన్నారు. గతంలో ఎన్నూడూ లేని విధంగా అంగన్‌వాడీ జీతాలు పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వలన అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాజంలో గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి ఏమి చేయాలన్నా ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకొని న్యాయం చేస్తారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏడు వేల నుంచి పదివేలు, వర్కర్లుకు ఆరు వేల రూపాయాలు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తుందన్నారు. త్వరలోనే అంగన్‌వాడీల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షురాలు అనె్నపురెడ్డి వాణీ, టీడీపీ నాయకురాలు పూజ, పలువురు అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.