విశాఖపట్నం

పెద్ద కొడుకులా సేవ చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 21: పేదింటి ప్రజల కలను నేరవేర్చడానికి మీ ఇంటి పెద్దకొడుకుగా అందరికీ అన్ని రకాల పథకాలు అందేలా చూస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ‘మీకు ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి. వాటిని నేను పరిష్కరిస్తా. దళారులను నమ్మి మోసపోకండి. పట్టాల మంజూరులో ఓ ఒక్కరికీ ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు. మీ నుంచి ఎవ్వరైనా డబ్బులు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వాలు ఓ ఒక్కరూ చేపట్టని విధంగా అందరికీ ఆస్తిలా స్వతంత్ర హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పట్టాల పంపిణీతో పాటు, రెండేళ్ల తరువాత వాటిని విక్రయించే విధంగా అన్ని హక్కులు కల్పిస్తున్నామన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే అర్హులైన వారికి పట్టాల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. ఈ.కృష్ణమూర్తి మాట్లాడుతూ అడ్డబిడ్డలకు అన్ని విధాలుగా మేలు చేకుర్చాలనే ఎన్టీ ఆర్ ఆశయం మేరకు పట్టాలను కూడా మహిళల పేరుతోనే అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు అర్హత లేనివారికి కూడా ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని, టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే పారదర్శకంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి భూ సమస్యలు పరిష్కరానికైనా తక్షణమే పరిష్కరించే విధంగా రెవెన్యూ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పేదలకు మేలు చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రాని విధంగా సీ ఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు రెండు వందల రూపాయాలు పెన్షన్ యిస్తేనే ఎంతో గొప్పగా చెప్పుకునే వారిని, అలాంటిది మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయాలు అందిస్తున్నామని మేమేంత గొప్పలు చెప్పుకొవాలని ప్రశ్నించారు. మాది గొప్పలు చెబుకునే ప్రభుత్వం కాదని,అభివృద్ధి, సంక్షేం అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదున్నారు. పేదలకు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏడాదికి 12వేల రూపాయాలను చంద్రబాబు అందిస్తున్నారన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో పేదలకు పట్టాలు ఇవ్వకపోవడమే కాకుండా పాకలు పీకేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు.పేదలకు పట్టాలతో పాటు బోనస్‌గా రెండేళ్ల తరువాత అమ్ముకునే హక్కును కల్పించారన్నారు. ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ ఏళ్ళ తరబడి జీవనం సాగిస్తున్నా ఏ నిమిషానికి ఏం జరుగుతోందోనన్న భయం ఉండేదని, ఇకపై ఎటువంటి భయం లేకుండా జీవించే హక్కును చంద్రబాబు కల్పించారన్నారు. పేదలకు పూర్తి స్థాయిలో లబ్థ చేకుర్చాలనే లక్ష్యంతో చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, పేదలందిరికీ ఇళ్లు, మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు.అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన మండల రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటు తదితర వాటని ఏర్పాటు చేసి పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మత్స్యకారుల కళల్లో ఆనందాన్ని నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. 50 ఏళ్లకే ఫించన్ అందించిన ఘనతతో పాటు, మత్స్యకారులకు డీజిల్ సబ్సీడీని అందించడం అభినందనీయమన్నారు. 2019 ఎన్నికల్లో మత్స్యకారులంతా మీ వెంటే ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో 0,686 మందికి, రెండో విడతలో 20 వేల మందికి, మూడో విడతలో 9,054 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. సుమారు పది లక్షల కోట్ల విలువ గల భూమిని రెగ్యులరైజేషన్ చేసామన్నారు. త్వరలోనే గిరిజనులకు ఆర్‌ఎఫ్‌ఆర్‌లో పట్టాలు అందిస్తామన్నారు. సమావేశంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ సృజన, డాక్టర్ సిరి, డి ఆర్ డీ ఎ పీడీ సత్యసాయి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
త్వరలోనే సింహచలం భూ సమస్య పరిష్కారం
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సింహచలం భూ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగర పరిధిలో పలు భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీనిలో భాగంగానే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల భూ సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తున్నామన్నారు.
నవచైతన్య ఆధ్వర్యంలో యోగ
ఆరిలోవ, జూన్ 21: నవచైతన్య యోగ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర్‌నగర్‌లో యోగాసనాలు వేశారు. సంస్థ సభ్యులు పలువురు యోగా దినోత్సవంలో భాగంగా పలు అంశాలను ప్రదర్శించారు. సాధకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అడపాల శివశంకర్, అరుణభారతి, జామి రామేశ్వర రావు, పీవీఎస్‌ఎన్ మూర్తి, నర్శింహరాజు, వెంకటరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం

విశాఖపట్నం, జూన్ 21: అత్యుత్తమ వైద్య విధానాలను అనుసరించి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నగరంలో గురువారం జరిగిన ఏపీహెల్త్ ఫెస్టివల్ 2018లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. వైద్య సేవలందించే క్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఐటీని అనుసంధానించడం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలు అందించనున్నామన్నారు.దేశ,విదేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ వైద్య విధానాలను అధ్యయనం చేయడంతో పాటు నూతన సాంకేతిక విధానాలను అనుసరించి వైద్య ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంతోషం, సంతృప్తితో కూడిన ఆరోగ్య సమాజ స్థాపన ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. నూతన వైద్య సేవలన అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పీపీపీ పద్ధతిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే ఆయుష్మాన్ భారత్ అమలుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రం ఏపీ అన్నారు. ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో రానున్న రెండేళ్లలో అంటు వ్యాధుల నియంత్రణ శతశాతం సాధిస్తామన్నారు.
ప్రస్తుతం మానవాళి జీవనశైలి పూర్తిగా మారిపోయిందని, తద్వారా అనేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. మానసిక రుగ్మతలకు పరిష్కారం కష్టమన్నారు. మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ఈ-సబ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల్లో 40 సబ్ సెంటర్లలో ఈ-వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయన్నారు. ఈ సందర్భంగా పాడేరు ఐటీడీఏ అనంతగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టోకూరు సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎంతో సీఎం మాట్లాడారు. గ్రామానికి చెందిన కన్నమ్మ అనే గిరిజన మహిళ వైద్య సేవల నిమిత్తం సబ్ సెంటర్‌కు రాగా టెలీ మెడిసిన్ విధానంలో రోగ లక్షణాలు తెలుసుకుని, ఫోన్‌లోనే వైద్యునితో సంప్రదించి టెలీ మెడిసిన్ ఇవ్వాలని సూచించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధి పాచిపెంట పీహెచ్‌సీ పీ కొనవలస, పాడేరు ఐటీడీఎ దారకొండ పీహేచ్‌సీ కొంగపాకలు సబ్‌సెంటర్‌లను ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌డీ, సీఎం బాలసురక్ష, 14 డయాలసిస్ కేంద్రాలను, ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆరోగ్య సలహాదారు జితేందర్ శర్మ, నీతి అయోగ్ సభ్యుడు వినోద్ పాల్, జె సత్యనారాయణ, ఇందు భూషణ్, షీనా షబ్ర, అరుణ్ సింఘాల్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ విభానికి సంబంధించి కేజీహెచ్‌కు, జనరల్ మెడిసిన్ బెస్ట్ ప్రాక్టీస్, హెచ్‌ఐవీ రోగులకు పంచామృతం పంపిణీ కార్పొరేట్ తరహాలో అనకాపల్లి, అగనంపూడి ఆసుపత్రుల నిర్వహణలో అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ అరుణ కుమారి, ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేఊన్ ఎన్ సుబ్బారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.