విశాఖపట్నం

ఇష్టానుసారంగా నిలిపే ఆటోలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: ప్రధాన రహదారుల్లో ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిలుపకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలీసు, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ, నిబంధనలపై ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు తరచుగా అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపి ట్రాఫిక్ సమస్యకు కారణం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లపై ఎటువంటి గుంతలు లేకుండా వెంటనే ప్యాచ్ వర్కులు చేయాలన్నారు. పలు రోడ్ల మలుపుల్లో పొదల క్లియరెన్స్ చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో స్పీడ్‌బ్రేకర్లు, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. సబ్బవరం-ఆనందపురం కల్వర్టు వద్ద యాక్సిడెంట్లకు అవకాశం లేకండా రిఫ్లక్టింగ్ రంగులతో పెయింటింగ్ పనులను నిర్వహించాలన్నారు. అన్ని ఆర్ అండ్ బి రోడ్లను ఆ శాఖ ఇంజనీర్లు, ట్రాఫిక్ పోలీసులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి అవసరమైన పనులను పూర్తి చేయాలన్నారు. అనకాపల్లి, వడ్డాది తదితర ప్రాంతాల్లో కూడా రోడ్లపై గోతులు ఉన్నాయని వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీరు మురళీకృష్ణ మాట్లాడుతూ సబ్బవరం, ఆనందపురం, పలు రోడ్లకు 58 లక్షలకు మంజూరు కావడం జరిగిందని, టెండర్లు పిలిచి పనులను చేయిస్తామన్నారు. అనకాపల్లి-పూడిమడక రోడ్డులో గల స్పీడ్ బ్రేకర్లను తొలగించామన్నారు. రోడ్లకు గోతులు ప్యాచ్ వర్కు పనులకు ఏజెన్సీని గుర్తించాలని జూలై 10వ తేదీ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. అరకు పంచాయితీలో ఐదు కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డుకు 22 కోట్ల రూపాయల మంజూరయ్యాయని డిపిఆర్ సమర్పించామన్నారు. రవాణాశాఖ డిప్యూడీ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 90 గ్రామ పంచాయితీలు, తొమ్మిది గిరిజన మండలాల్లో క్రేజల వద్దకే రవాణాశాఖ కార్యక్రమాలు నిర్వహించి సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో జనవరి 18 నుండి మే 18 వరకు మే 18 వరకు 12,152 కేసులు బుక్ చేశామని తెలిపారు. తదుపరి కలెక్టర్ బ్రీత్ ఆన్‌లైజర్లు, మూడు స్పీడు గన్లను పోలీసు అధికారులకు, రవాణాశాఖాధికారులుకు అందించారు. ఈ సమావేశంలో ఎస్‌పి (రూరల్) రాహుల్‌దేవ్‌శర్మ, ఏడిసిపి రమేష్‌కుమార్, జీవిఎంసీ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పోలీసు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.